Advertisement

  • బంగాళాదుంప స్మైలీ ఎలా చేయాలో తెలుసుకుందాం

బంగాళాదుంప స్మైలీ ఎలా చేయాలో తెలుసుకుందాం

By: chandrasekar Tue, 04 Aug 2020 6:25 PM

బంగాళాదుంప స్మైలీ ఎలా చేయాలో తెలుసుకుందాం


బంగాళాదుంప అంటే ఇష్టపడనివారు ఎవ్వరు ఉండరు. చాలా మంది బంగాళాదుంప చిప్స్ ని ఇష్టపడే వాళ్లు ఉన్నారు. వాటిలాగే కరకరలాడే బంగాళాదుంప స్మైలీలను కూడా చేసుకోవచ్చు. ఇది అమెరికన్ స్నాక్. చేయడం చాలా సులువు

కావాల్సిన పదార్థాలు

బంగాళాదుంపలు - ఏడు
కార్న్ ఫ్లోర్ - మూడు స్పూనులు
చీజ్ తురుము - ఒక కప్పు
ఉప్పు - ఒక టీస్పూను
నూనె - తగినంత
కారం - ఒక టీస్పూను
వెల్లుల్లి తురుము - టీ స్పూను

ముందుగా బంగాళాదుంపను ఉడకబెట్టి తొక్క తీసి వాటిని సన్నగా తురిమేయాలి. పెద్ద గిన్నెలో వాటిని వేసి, అందులో తురిమేసిన చీజ్ ని, వెల్లుల్లి తురుముని వేసి బాగా కలపాలి. ఉప్పు, కారం, కార్న్ ఫ్లోర్ కూడా వేసి బాగా కలపాలి. మొత్తం మిశ్రామాన్ని ముద్దలా అయ్యేలా బాగా కలపాలి. అవసరమైతే కాస్త నీళ్లు చేర్చచ్చు. ముద్దలా చేశాక ఆ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో గంటసేపే ఉంచాలి. తరువాత తీసి చిన్న ఉండలుగా చుట్టి చిప్స్ సైజులో వత్తాలి. చాకుతో వాటిని కళ్లు, ముక్కు, నోరు పెట్టాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడైయాక స్మైలీలను వేసి వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చాక తీసి ప్లేటులో వేసుకోవాలి. వాటిని టమోటా సౌస్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Tags :
|
|
|

Advertisement