Advertisement

  • క్యాలీఫ్లవర్ ఫ్రై టేస్టీగా చేయడం ఎలాగో తెలుసుకుందాం

క్యాలీఫ్లవర్ ఫ్రై టేస్టీగా చేయడం ఎలాగో తెలుసుకుందాం

By: chandrasekar Thu, 20 Aug 2020 5:35 PM

క్యాలీఫ్లవర్  ఫ్రై టేస్టీగా చేయడం ఎలాగో తెలుసుకుందాం


కావలసిన పదార్థాలు:

* క్యాలీఫ్లవర్‌ తరుగు – 3 కప్పులు
* కొబ్బరి నూనె లేదా నెయ్యి – 3 టేబుల్‌ స్పూన్లు
* ఉల్లి తరుగు – అర కప్పు
* తరిగిన పచ్చి మిర్చి – 1
* కరివేపాకు – రెండు రెమ్మలు
* టొమాటో తరుగు – అర కప్పు
* నీళ్లు – 3 కప్పులు
* ఉప్పు – తగినంత; పేస్ట్‌ కోసం
* అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు
* సోంపు – పావు టీ స్పూను
* పసుపు – పావు టీ స్పూను
* మిరప కారం – పావు టీ స్పూను
* మిరియాల పొడి – పావు టీ స్పూను
* గరం మసాలా పొడి – పావు టీ స్పూను
* జీలకర్ర పొడి – అర టీ స్పూను
* ధనియాల పొడి – అర టీ స్పూను
* ఉప్పు – తగినంత
* కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ విధానం:

గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు క్యాలీఫ్లవర్‌ తరుగు వేసి శుభ్రంగా కడగాలి. స్టౌ మీద బాణలిలో మూడు కప్పుల నీళ్లు, ఉప్పు వేసి మరిగించి దింపేయాలి. క్యాలీఫ్లవర్‌ను అందులో వేసి సుమారు పది నిమిషాల తరవాత నీరంతా ఒంపేయాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి లేదా కొబ్బరి నూనె వేసి కాగాక, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. టొమాటో తరుగు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి. ముక్కలు బాగా మెత్తపడ్డాక, పసుపు, మిరపకారం, మిరియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి వేయించాలి. క్యాలీఫ్లవర్‌ తరుగు వేసి బాగా కలియబెట్టాలి మూత పెట్టి సన్నని మంట మీద కొద్దిసేపు ఉంచి, దింపేయాలి. కొత్తిమీరతో అలంకరించాలి అంతే క్యాలీఫ్లవర్ ‌ ఫ్రై రెడీ.

Tags :
|
|

Advertisement