Advertisement

  • రోగనిరోధక శక్తినిచ్చే ఆపిల్, వాల్నట్, లోటస్ రూట్ సలాడ్ :

రోగనిరోధక శక్తినిచ్చే ఆపిల్, వాల్నట్, లోటస్ రూట్ సలాడ్ :

By: chandrasekar Wed, 15 July 2020 8:14 PM

రోగనిరోధక శక్తినిచ్చే ఆపిల్, వాల్నట్, లోటస్ రూట్ సలాడ్ :


ఈ టేస్టీ సలాడ్ ని ఓసారి ట్రై చేయొచ్చు. ఇందులో వాడే అన్ని పదార్థాలు ఆరోగ్యానికి సంబంధించినవే. అంతేకాకుండా దీనిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. తాజా పండ్లు, గింజలు చేర్చడం దీనికి అదనపు బలం. మరిన్ని విషయాలు తెలుసుకుందామా.

ఆపిల్, పాలకూర, వాల్‌నట్స్‌ వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలామందికీ తెలుసు. కాని “తామర మొక్క కాండం, ఖనిజాలు, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలతో నిండి ఉందని ఎంత మందికి తెలుసు. మీకు తెలుసా, ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతాయి.” అని నిపుణులు చెబుతున్నారు.

సలాడ్‌కి కావలసిన పదార్ధాలు :

* చిన్న చిన్న పాలకూర: 1 కప్పు
* కప్ - వాల్‌నట్స్: ½ కప్
* లోటస్ రూట్, లేదా కమల్ కాక్డి; 1
* యాపిల్స్; 2
* టేబుల్ స్పూన్ల వెన్న; 2
* టేబుల్ స్పూన్లు నిమ్మరసం; 2

సలాడ్‌ తయారుచేసే విధానం :

* 1 లోటస్ రూట్ తీసుకొని శుభ్రంగా కడగండి.
* పై తొక్క తీసి, సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి.
* లోటస్ రూట్ ముక్కలను 4 నుండి 5 నిమిషాలపాటు ఆవిరికి ఉడకనివ్వండి.
* ఆపై అబ్సార్బెంట్ కాగితం ఉపయోగించి, ఆ ముక్కల మీది నీటిని తొలగించండి.
* పాన్లో 1 టేబుల్ స్పూన్ బట్టర్ వేసి, ఉడికించిన ముక్కలను గ్రిల్ చేయండి.
* ఆపిల్స్ ముక్కలుగా చేసి, వాటిపై నిమ్మ రసం వేయండి.
* పాలకూరలోలో నీరు లేకుండా చూడండి.

డెకరేషన్ చేయడానికి:

* 1 టేబుల్ స్పూన్ బట్టర్ ను తక్కువ వేడి మీద గోధుమ రంగులోకి వచ్చేవరకు వేడి చేయండి.
* వాల్‌నట్స్ వేసి, కొంచం నిమ్మరసం ఎక్కువవేసి టాస్ చేసి, పాన్ డీగ్లేజ్ చేయండి.
* ఒక గిన్నెలో పాలకూర, ఆపిల్ ముక్కలు, కాల్చిన లోటస్ రూట్స్ వేసి టాసు వేయండి.
* సలాడ్ ప్లేట్లోకి తీసుకోండి.
* ఉప్పు, మిరియాల పొడిని పైన చిలకరించండి.

అంతే ఎంతో టేస్టీగా ఉండే సలాడ్ రెడీ అయినట్లే. ఇది ఎంతో హెల్దీ. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.

Tags :
|
|
|

Advertisement