Advertisement

రుచికరమైన వెజ్ పులావ్ తయారీ విధానం

By: Sankar Sun, 21 June 2020 7:14 PM

రుచికరమైన వెజ్ పులావ్ తయారీ విధానం



మనకు ఇష్టమైన కూరగాయలను అన్ని ఒకే సారి తినాలనుకుంటే వెజ్ పులావ్ ను మించిన బెస్ట్ ఆప్షన్ ఇంకోటి ఉండదు ..అందులో మనకు నచ్చిన అన్ని రకాల కాయగూరలు వేసుకొని చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఆ రుచికరమైన , ఆరోగ్యకరమైన వెజ్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

ముందుగా వెజ్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్ధాలు :

1 కప్ నానబెట్టినవి బాస్మతి బియ్యం
1 కప్ క్యారట్ ముక్కలు
1 కప్ బీన్స్ ముక్కలు
1 కప్ చిక్కుడు
1 కప్ బఠానీలు
2 బిర్యానీ ఆకు
సరిపడినన్ని నీళ్లు
1 టీ స్పూన్ నెయ్యి
2 పచ్చి మిర్చి
1 నల్ల ఏలకులు
1 దాల్చిన చెక్క
అవసరాన్ని బట్టి లవంగం
1 టీ స్పూన్ జీలకర్ర
ఇంకా మనకు కావాల్సిన కూరగాయలు


how to,make,vegetable,pulao,basmathi rice , వెజ్ , పులావ్, తయారీ విధానం , బిర్యానీ , బాస్మతి బియ్యం



తయారీ విధానం

కడాయిలో నూనె వేసుకొని వేడిచేయండి. ఇపుడు జీలకర్ర , లవంగాలు , బే లిఫ్స్ , యాలకలు, దాల్చిన చెక్క వేసుకొని ఒక నిముషం వేయించు కొండి.

ఆ తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు , క్యారెట్, బీన్స్ కాలాయిలో వేసి పెద్దమంట మీద 3 నుంచి 4 నిముషాలు వండుకోవాలి.

కూరగాయలు కొంచెం ఉడికిన తర్వాత బాస్మతి రైస్ ని వేసుకొని అందులో రెండున్నర కప్పుల నీళ్లను పోసుకొని ఉడికించుకోవాలి . నీళ్లు మరిగిన వెంటనే ఉప్పును వేసుకొని 10 నిముషాలు చిన్న మంట మీద వండుకోవాలి. తరువాత ఆవిరిని చల్లబడనివ్వాలి.

ఇప్పుడు రైతా, మీకు ఇష్టమైన కూరతో రుచికరమైన వెజిటల్ పులావ్ ని వడ్డించుకోండి.


Tags :
|
|
|

Advertisement