Advertisement

  • కొబ్బరి తురుముతో అత్యంత రుచికరమైన పాన్ కేక్ తయారీ విధానం

కొబ్బరి తురుముతో అత్యంత రుచికరమైన పాన్ కేక్ తయారీ విధానం

By: Sankar Sun, 30 Aug 2020 11:18 AM

కొబ్బరి తురుముతో అత్యంత రుచికరమైన పాన్ కేక్ తయారీ విధానం


కొబ్బరికాయను మనం అనేక విధాలుగా వాడతాము ..డైరెక్ట్ అలాగే తినొచ్చు , లేదా పచ్చడి చేసుకోవచ్చు లేదా ఎండబెట్టి ఎండు కొబ్బరి లాగ కూడా వాడొచ్చు కానీ కొబ్బరితో పాన్ కేక్ కూడా తయారు చేయొచ్చు అనే విషయం చాల మందికి తెలీదు..అలంటి వారికోసమే ఇప్పుడు ఈ పాన్ కేక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు :

ఎండు కొబ్బరి తురుము – 1 కప్పు, బేకింగ్‌ పౌడర్‌ – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కొబ్బరి పాలు – 5 టేబుల్‌ స్పూన్లు, స్వచ్ఛమైన కొబ్బరి నూనె – పావు టేబుల్‌ స్పూన్, గుడ్లు – 4,
తేనె – 2 టేబుల్‌ స్పూన్లు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ – అర టీ స్పూన్, నిమ్మకాయ తొక్క పొడి – పావు టీ స్పూన్, బాదం పాలు – అర కప్పు, నెయ్యి – పాన్‌కేక్స్‌ వేసుకునేందుకు సరిపడా

తయారీ విధానం :

1. ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో ఎండు కొబ్బరి తురుము, బేకింగ్‌ పౌడర్, ఉప్పు, నిమ్మకాయ తొక్క పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి.

2. ఇప్పుడు అందులో కొబ్బరి నూనె, తేనె, గుడ్లు, కొబ్బరి పాలు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ కూడా వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి.

3. ఇప్పుడు పాన్‌ వేడి చేసుకుని నెయ్యి వేసుకుని, ఆ మిశ్రమంతో చిన్న చిన్న పాన్‌కేక్స్‌లా వేసుకుని, రెండువైపులా దోరగా వేయించుకోవాలి.

4. వేడి వేడిగా ఉన్నప్పుడే అరటి పండు ముక్కలు, ఇతర డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Tags :
|
|

Advertisement