Advertisement

  • నోరూరించే మిక్సెడ్ వెజిటేబుల్ పకోడీ తయారీ విధానం

నోరూరించే మిక్సెడ్ వెజిటేబుల్ పకోడీ తయారీ విధానం

By: Sankar Fri, 26 June 2020 1:03 PM

నోరూరించే మిక్సెడ్ వెజిటేబుల్ పకోడీ తయారీ విధానం


వర్షాకాలంలో సాయంత్రం సమయంలో వర్షం పడుతుంటే వేడివేడిగా పకోడీలు వేసుకునే తింటే ఆ టేస్ట్ అద్భుతం అనే చెప్పాలి ..అయితే ఎవరైనా పకోడీలు అంటే ఆనియన్స్ , పిచ్చి మిర్చిలను శనగపిండిలో కలిపి వేసుకుంటారు ..అయితే ఎప్పుడు ఇలా ఒకే రకమైన పకోడీ తిని బోర్ వచ్చిన వారికోసమే ఈ స్పెషల్ మిక్సెడ్ వెజిటేబుల్ పకోడీ ..రుచికి రుచి మరియు ఆరోగ్యాన్ని అందించే ఈ మిక్సెడ్ వెజిటేబుల్ పకోడీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ..

ముందుగా కావాల్సిన పదార్ధాలు :

శెనగపిండి - ఆరు కప్పులు
బంగాళాదుంపలు - రెండు
ఉల్లిపాయలు - రెండు
క్యాప్సికమ్ - రెండు, ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
కారం - ఒక టీస్పూను

తయారీ విధానం :

ముందుగా బంగళాదుంపల పొట్టు తీసేయాలి. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కోసుకోవాలి.

వాటిని ఒక గిన్నెలో వేసి అందులో శెనగపిండి, నీళ్లు పోసి కలపాలి. ఉప్పు , కారం కూడా చేర్చాలి. పకోడీ వేసుకోవడానికి వీలుగా దీనిని కలుపుకోవాలి.

అవసరమైనంత మేర నీళ్లు కలపొచ్చు. తర్వాత స్టవ్ మీద ఒక బాణీ పెట్టి నూనె పోయాలి..

నూనె వేడెక్కిన తర్వాత ఆ మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోవాలి. దీనిని గ్రీన్ చట్నీతో కానీ, కెచప్ తో కానీ తింటే టేస్టుగా ఉంటుంది.


Tags :
|
|
|

Advertisement