Advertisement

  • రుచికరమైన బాదాం హల్వా తయారు చేయడం ఎలా !

రుచికరమైన బాదాం హల్వా తయారు చేయడం ఎలా !

By: Sankar Sun, 06 Sept 2020 4:46 PM

రుచికరమైన బాదాం హల్వా తయారు చేయడం ఎలా !


దేశవ్యాప్తంగా బాదం హల్వా అనే తీపి పదార్థం ప్రఖ్యాతి గాంచింది. పండుగలలో, వేడుకలలో, పెళ్లిళ్లలో, పేరంటాలలో ఇలా వివిధ సంతోషకర సందర్భాలలో బాదం హల్వాని తయారుచేసుకుంటారు. బాదం, చక్కెర మరియు నేతిని ప్రధాన పదార్థాలుగా తీసుకుని తయారుచేసే ఈ బాదం హల్వా రుచి అమోఘంగా ఉంటుంది. నోట్లోని వేసుకోగానే కరిగిపోయే ఈ బాదం హల్వాను పిల్లల నుంచి పెద్దల వరకు అమితంగా ఇష్టపడతారు.మరి ఇంతటి రుచికరమైన బాదాం హల్వా తయారీ విధానం ఇప్పుడు చూదాం ..

కావాల్సిన పదార్దాలు :

బాదం - 1 కప్పు

చక్కెర - ½ కప్పు

నీళ్లు - 5½ కప్పులు

నెయ్యి - ½ కప్పు

కుంకుమపువ్వు పోగులు - 7-8


తయారీ విధానం :

1. వేడిచేసిన ప్యాన్ లో నాలుగు కప్పుల నీటిని జోడించండి. దాదాపు 2 నిమిషాల వరకు నీటిని మరగనివ్వండి.

2. ఇప్పుడు బాదాం పప్పులను జోడించి ఒక లిడ్ తో ప్యాన్ ను కవర్ చేయండి. హై ఫ్లేమ్ లో దాదాపు 8 నుంచి పది నిమిషాల వరకు ఇలా కుక్ చేయండి.

3. బాదం సరిగ్గా ఉడికిందో లేదో చెక్ చేయండి. ఇందుకు, ఒక బాదంను తీసుకుని బాదం చెక్కు సులభంగా వచ్చిందో లేదో చూడండి. ఒకవేళ బాదం చెక్కు సులభంగా వస్తే బాదాం సరిగ్గా ఉడికినట్టేనని అర్థం.

4. స్టవ్ పైనుంచి ప్యాన్ ను తీసుకుని అందులోనున్న ప్యాన్ లో నున్నవాటిని ఒక బౌల్ లోకి బదిలీ చేయండి. ఆ తరువాత, అయిదు నిమిషాల వరకు ఆ బౌల్ లోని పదార్థాలని చల్లబడనివ్వండి. ఇప్పుడు, ఇంకొక బౌల్ లో ఒక కప్పుడు నీటిని తీసుకోండి. బాదంని ప్రెస్ చేసి బాదం చెక్కులను తొలగించండి. ఇలా చేయడం ద్వారా బాదం చెక్కులను త్వరగా తొలగించవచ్చు.

5. బాదం చెక్కులను తొలగించిన తరువాత బాదం పప్పులను వేరొక బౌల్ లోకి బదిలీ చేయండి. ఇప్పుడు, బాదంలను ఒక మిక్సర్ జార్ లోకి తీసుకోండి. ఒక పావు కప్పుడు నీటిని జోడించి, బాదం పప్పులను చక్కటి పేస్ట్ లా నూరుకోండి. ఇప్పుడు, ఈ పేస్ట్ ని ఒక పక్కన పెట్టుకోండి.

6. వేడిచేసిన ప్యాన్ లో ఒక పావు కప్పుడు నీటిని తీసుకోండి. ఇప్పుడు, చక్కెరని జోడించి బాగా కలపండి. చక్కెర కరిగిపోయేవరకు బాగా కలపండి. ఇందులో, కుంకుమ పువ్వు పోగులను జోడించండి. ఒక నిమిషం పాటు ఈ మిశ్రమాన్ని మరగనివ్వండి. ఆ తరువాత, లో ఫ్లేమ్ కి మార్చండి.

7. మరొక వేడిచేసిన ప్యాన్ లో నేతిని పోయండి. నేయి కరగగానే, బాదం పేస్ట్ ను జోడించండి. దాదాపు 8 నుంచి పదినిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండండి. ఈ మిశ్రమం అనేది గ్రాన్యులర్ కన్సిస్టెన్సీ కి వచ్చేవరకు ఇలా కలుపుతూనే ఉండాలి

8. ఇప్పుడు, చక్కెర పాకాన్ని వేసి దాదాపు రెండు నిమిషాల వరకు బాగా కలుపుతూ ఉండాలి. నేయి అనేది సెపరేట్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి.

9. ఇప్పుడు, స్టవ్ మీద నుంచి ప్యాన్ ను తీసుకుని అందులోని హల్వాను ఒక బౌల్ లోకి మార్చండి. రూమ్ టెంపరేచర్ లో గాని లేదా చల్లగా గానీ బాదం హల్వాని వడ్డించుకోవచ్చు.







Tags :
|
|

Advertisement