రుచికరమైన స్వీట్ పొంగల్ తయారీ విధానం
By: Sankar Sun, 12 July 2020 7:50 PM
దక్షిణ భారతదేశంలో పండగ అనగానే చాల మంది తయారు చేసే వంటకం స్వీట్ పొంగల్ ..దీనినే చక్కెర పొంగల్. అని కూడా అంటారు..ఎంతో రుచిగా ఉండే ఈ స్వీట్ పొంగల్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ..
కావాల్సిన పదార్ధాలు :
1 కప్ బియ్యం, 1/2 కప్ పెసరపప్పు, 1 కప్ తురిమిన టెంకాయ, 5 టీ స్పూన్ నెయ్యి, 1 కప్ బెల్లం పొడి, యాలకులు,జీడిపప్పు, నీళ్ళు,
తయారీ విధానం :
1. ముందుగా బియ్యం, పెసరపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి.
2. ఇప్పుడు కుక్కర్ ఆవిరి పోయే వరకూ ఉంచి.. ఉడికిన అన్నం మిశ్రమాన్ని గరిటెతో మెత్తగా చిదమాలి. ఇందులోనే కొద్ది కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి.
3. ఇప్పుడు పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో కొన్ని జీడిపప్పులు వేసి వేయించి ఓ గిన్నెలోకి పక్కనతీయాలి.
4. ఇప్పుడు అదే పాన్‌లో బెల్లం, నీరు వేయాలి. అందులోనే యాలకులు వేయండి. బెల్లం కరిగేలా వేడి చేయండి. బెల్లం పూర్తిగా కరిగాక అందులో యాలకులను వేయాలి. ఇది స్వీట్ రెసిపీకి మంచి టేస్ట్‌ని ఇస్తుంది.
5. బెల్లం మిశ్రమం మరుగుతున్నప్పుడు బియ్యం మిశ్రమాన్ని అందులో వేసి ఉండలు కట్టకుండా బాగా కడపాలి.
6. ఇప్పుడు పొంగల్ మిశ్రమాన్ని కొద్దిగా ఉడికిన తర్వాత అందులో నెయ్యి వేయాలి. ఇలా తయారైన పొంగల్ని ఓ బౌల్లోకి తీసుకుని జీడిపప్పులతో గార్నిష్ చేయాలి. ఇది వేడి వేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.