Advertisement

  • పిల్లలకు వెరైటీ టిఫిన్ స్వీట్ దోశ తయారీ విధానం

పిల్లలకు వెరైటీ టిఫిన్ స్వీట్ దోశ తయారీ విధానం

By: Sankar Sat, 25 July 2020 5:24 PM

పిల్లలకు వెరైటీ టిఫిన్ స్వీట్ దోశ తయారీ విధానం



ఉదయం లేవగానే పిల్లలకు టిఫిన్ పెట్టాలంటే చాల మంది తల్లులకు అత్యంత కష్టమైన పని ..పిల్లలు రోజుచేసే టిఫ్ఫిన్లు చేస్తే తినను అని మారం చేస్తారు అందుకే అలంటి వారికోసమే దోశల్లోనే కొంచెం వెరైటీ లు చేస్తే ఇష్టంగా తింటారు ..ఇలా ఒక వెరైటీ రకమైన దోశ స్వీట్ దోశ...ఈ స్వీట్ దోశ ఎలా తయారు చేయాలో ఇపుడు చూదాం ..

కావాల్సిన పదార్థాలు

బియ్యప్పిండి- అరకప్పు, గోధుమ పిండి - ఒక కప్పు, కొబ్బరి తురుము - రెండు టీ స్పూనులు, బెల్లం తురుము - ఒక కప్పు, నెయ్యి - పావు కప్పు, శొంఠి పొడి - చిటికెడు, యాలకుల పొడి - అర చెంచా, జీడిపప్పు, కిస్‌మిస్‌లు - గుప్పెడు.

తయారీ విధానం :

1. బెల్లం తరుగును ఓ గిన్నెలో వేసి నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి. లేత పాకం అవుతున్నప్పుడు దింపేయాలి.

2. ఈలోపు మరో గిన్నెలో బియ్యప్పిండి, గోధుమ పిండి వేసి బాగా కలిపేయాలి. అందులో కొబ్బరి తురుము, శొంఠి పొడి, యాలకుల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు బెల్లం పాకాన్ని గోధుమపిండి మిశ్రమంలో కలుపుకోవాలి. దోశపిండిలా అయ్యేలా కాస్త నీరు చేర్చవచ్చు. అలాగని మరీ పల్చగా చేసేయకూడదు.

4. ఆ రుబ్బులో వేసిన జీడిపప్పు, కిస్ మిస్‌లు కలిపాలి. ఆ మిశ్రమాన్ని పెనంపై దోశెలా వేసుకోవాలి. పైన నెయ్యి వేసి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. అంతే తియ్యని దోశెలు సిద్ధం. దీనిని ఏ చట్నీ అవసరం లేకుండా తినేయచ్చు.

Tags :
|

Advertisement