Advertisement

  • అన్ని పప్పులతో రుచికరమైన స్నాక్ ఐటెం మిక్సెడ్ దాల్ వడ తయారీ

అన్ని పప్పులతో రుచికరమైన స్నాక్ ఐటెం మిక్సెడ్ దాల్ వడ తయారీ

By: Sankar Mon, 17 Aug 2020 4:34 PM

అన్ని పప్పులతో రుచికరమైన స్నాక్ ఐటెం మిక్సెడ్ దాల్ వడ తయారీ


పప్పుతో తయారయ్యే వడ ఎంతో టేస్టీగా ఉంటుంది. సాధారణంగా మినపప్పుతో వడలు చేస్తుంటాం.. కానీ, ఈ మిక్స్‌డ్ దాల్ వడ అన్ని పప్పులతో కలిపి చేస్తాం. అందుకే ఈ వడ మరింత రుచిగా ఉంటుంది. మరి ఈ వడకి కావాల్సిన పదార్థాలు తయారీ చేసే విధానం ఏంటో ఇప్పుడు చూద్దామా..

కావాల్సిన పదార్ధాలు :

1 కప్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ సెనగ పప్పు, 1 టేబుల్ స్పూన్ కందులు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు , మిరపపొడి కావాల్సినంత , చాట్ మసాలా రుచికి సరిపడా , వేయించిన జీలకర్ర పొడి రుచికి సరిపడా , హిమాలయన్ సాల్ట్ రుచికి సరిపడా ,3 టేబుల్ స్పూన్ పాలు, రీఫైండ్ ఆయిల్ లేదా సుద్దిచేసిన నూనె, యోగర్ట్ కొద్దిగా

తయారీ విధానం :

1. ముందుగా అన్ని పప్పులని తీసుకుని ఓ పెద్ద బౌల్‌లో 2 గంటల ముందు నానబెట్టాలి.

2. ఎప్పుడైతే పప్పులన్నీ చక్కగా నానుతాయో.. వాటిని మిక్సీ జార్‌‌లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఆ మిక్సీ పట్టిన పేస్ట్‌లో ఇంగువ వేసి బాగా కలపాలి.

3. ఇప్పుడు పెరుగుని బాగా కలపండి. తర్వాత అందులోని పాలు కూడా వేసి మరికాసేపు బాగా కలపాలి. అనంతరం ఉప్పు కూడా వేసి కలిపి పక్కన పెట్టాలి.

4. ఇప్పుడు పాన్ తీసుకుని వేడి చేయాలి. పాన్ వేడి అయిన తర్వాత నూనె వేసి వేడి చేయండి. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని తీసుకుని మరుగుతున్న నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకూ ఫ్రై చేయండి.

5.. చివరిగా వడలపై పెరుగు, చాట్ మసాలా, వేయించిన జీలకర్ర, కారం, స్వీట్ చింతపండు చట్నీ వేసి సర్వ్ చేయండి. అంతే ఎంతో టేస్టీగా ఉండే వడ తయారైనట్లే.


Tags :
|
|

Advertisement