Advertisement

  • రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పాలకూర దోశ

రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పాలకూర దోశ

By: Sankar Fri, 26 June 2020 12:57 PM

రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పాలకూర దోశ


సౌత్ ఇండియాలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అంటే అందరికి ఎక్కువగా గుర్తొచ్చే పేర్లు ఇడ్లీ ,వడ , దోశ ..ఇందులో దోశను పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరు చాల ఇష్టంగా తింటారు తయారీ కూడా అంత పెద్ద కష్టమైన పని కాదు ..అయితే దోశలో మసాలా దోశ , ఆనియన్ దోశ , పన్నీర్ దోశ అని ఇలా రకరకాల దోశలు ఉంటాయి ..అయితే దోశ లో ఉండే పోషకాలతో పాటు ఇంకా మరిన్ని పోషకాలు రావాలంటే పాలకూర దోశ ట్రై చేయాల్సిందే ..పాలకూర ను చాల మంది కర్రీ రూపంలో తినడానికి అంతగా ఇష్టపడరు అలాంటి వాళ్ళకోసమే ఈ పాలకూర దోశ ..ఇప్పుడు ఈ పాలకూర దోశ ఎలా తయారు చేయాలో తెల్సుకుందాం ..

కావాల్సిన పదార్ధాలు ..

పాలకూర ప్యూరీ - అరకప్పు
మినపప్పు - పావు కప్పు
మెంతులు - అరటీస్పూను
గోధుమపిండి - ఒక కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - నాలుగు టీస్పూనులు




how to,make,spinach,dosa,healthy ,రుచికరమైన , పాలకూర , దోశ , తయారు, మినపప్పు



తయారీ విధానం :

మినపప్పును, మెంతుల్ని నాలుగ్గంటల పాటూ నానబెట్టుకోవాలి. పాలకూరని శుభ్రంగా కడిగి బాగా తరిగి మిక్సీలో వేసుకుని మెత్తటి ప్యూరీలా చేసుకోవాలి.

ఇప్పుడు మినపప్పును, మెంతుల్ని కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఒక గిన్నెలోకి ఆ మిశ్రామాన్ని తీసుకుని... అందులో పాలకూర ప్యూరీని కూడా కలపాలి.

గోధుమ పిండి, ఉప్పు, తగినన్నీ నీళ్లు కూడా పోసి బాగా కలపాలి. ఉండలు కట్టకుండా గా కలపాలి

దోశెలు పోసుకోవడానికి వీలుగా అవసరమేతై నీళ్లు పోసి పిండి మిశ్రమం పల్చగా ఉండేలా చేసుకోవాలి

ఆ తరువాత స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆ మిశ్రమంతో దోశెలు పోసుకుని కొబ్బరి చట్నీతో తింటే ఆ టేస్టే వేరు.




Tags :
|
|
|

Advertisement