Advertisement

చిటికెలో సేమియా ఉప్మా తయారీ విధానం..

By: Sankar Tue, 14 July 2020 3:58 PM

చిటికెలో సేమియా ఉప్మా తయారీ విధానం..



ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనగానే సామాన్యంగా అందరికి గుర్తోచేవి ఇడ్లీ , వడ , పూరి , దోశ, ఉప్మా ..ఇందులో ఉప్మా చిటికెలో అయిపోతుంది ..కానీ ఎప్పుడు ఒకే రకం ఉప్మా తినాలన్న తినాలనిపించదు ..అందుకే అలంటి వారికోసమే సేమియాతో ఉప్మా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ..

సేమియా ఉప్మా కి కావాల్సిన పదార్ధాలు :

సేమియా (వెర్మిసెల్లి) - 2 కప్స్
నీరు 1 ½కప్స్
ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా తరిగినవి)
గ్రీన్ బటానీలు ½కప్
క్యారట్ 1 (సన్నగా తరిగినవి)
టమోటో: 1 (చిన్న ముక్కలుగా తరిగినవి)
పచ్చిమిర్చి 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
పసుపు ¼ టేబుల్ స్పూన్
ఆవాలు 1 టేబుల్ స్పూన్
మినపప్పు: 1 టేబుల్ స్పూన్
శెనగపప్పు ½ టేబుల్ స్పూన్
కరివేపాకు 6-7
ఎండు మిర్చి: 1
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: 2టేబుల్ స్పూన్

how,to make,semiya,upma,recipe,breakfast ,సేమియా,  ఉప్మా , తయారీ , విధానం, బ్రేక్ ఫాస్ట్



తయారీ విధానం :

1. ముందుగా పాన్ వేడి చేసి అందులో నూనె వేసి లైట్ గా కాగిన తర్వాత అందులో సేమియా వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.

2. తర్వాత వేరే ప్లేట్ లోనికి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి.

3. తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, ఎండు మరి్చి, ఉద్దిపప్పు, శెనగపప్పు, కరివేపాకు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.

4. తర్వాత అందులోనే ఉల్లిపాయలు కూడా వేసి మరో 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.

5. తర్వాత అందులో కొద్దిగా పసుపు, క్యారెట్, గ్రీన్ పీస్, పచ్చిమిర్చి మరియు టమోటో ముక్కలు కూడా వేసి మరో 5-6నిముషాలు వేగించుకోవాలి.

6. మొత్తం మిశ్రమం వేగిన తర్వాత అందులో ముందుగా వేయించి పెట్టుకొన్న సేమియా, ఉప్పు, మరియు నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.

7. తర్వాత మూత పెట్టి 5-10 నిముషాలు ఉడికించుకోవాలి.

8. ఉడికిన తర్వాత మూత తీసి నీరు మొత్తం పూర్తిగా ఇమిరిపోయే వరకూ సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి..

9. ఒక సారి నీరు మొత్తం డ్రై అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి అంతే టేస్టీ అండ్ ఈజీ సేమియా ఉప్మా రెడీ. ఈ డిష్ ను కొబ్బరి చట్నీతో ఎంజాయ్ చేయవచ్చు.





Tags :
|
|
|
|

Advertisement