Advertisement

  • వేడి వేడి మసాలా ఆలు ఫ్రై తయారీ విధానం ..

వేడి వేడి మసాలా ఆలు ఫ్రై తయారీ విధానం ..

By: Sankar Tue, 07 July 2020 7:15 PM

వేడి వేడి మసాలా ఆలు ఫ్రై తయారీ విధానం ..



వర్షాకాలం ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతోంది ఈ ఫర్ ఫెక్ట్ వాతారణానికి ఫర్ ఫెక్ట్ గా ఆహారం తీసుకోవాలని అనిపిస్తున్నదా.. చలికి కారంగా ఏదైనా సైడ్ డిష్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా.. అయితే మసాలా ఆలూ ఫ్రై ఫర్ ఫెక్ట్ సైడ్ డిష్. దీనిని చాలా సులభంగా, సింపుల్ గా తయారుచేయవచ్చు. చాలా తక్కువ మసాలా దినుసులతో క్రిస్పీగా కరకరలాడే ఆలూ ఫ్రై సాంబార్, రసం, చారు వంటి మీల్ డిష్ కు ఫర్ ఫెక్ట్ సైడ్ డిష్ గా నప్పుతుంది. మరి ఈ సింపుల్ అండ్ ఈజ్ మసాలా ఆలూ ఫ్రై ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావాల్సిన పదార్ధాలు :

బంగాళ దుంపలు: 2 (ఒలిచిన మరియు కావల్సిన సైజ్ లో తరిగినవి), కారం: 1 టేబుల్ స్పూన్ , పసుపు: ½ టేబుల్ స్పూన్ , వాము-½ టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి :2 (చిన్న ముక్కలుగా తరిగినవి), ఛాట్ మసాలా: 1టేబుల్ స్పూన్, నూనె: 2టేబుల్ స్పూన్, ఉప్పు: రుచికి సరిపడా

తయారీ విధానం :

1. ముందుగా డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో అజ్వైన్ విత్తనాలు వేసి ఒక నిముషం వేగించాలి తర్వాత చిటికెడు కారం కూడా వేసి ఫ్రై చేయాలి.

2. ఇప్పుడు బంగాళదుంప ముక్కల మీద కారం, పసుపు, ఛాట్ మసాలా మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇలా మసాలాలతో మిక్స్ చేసి పెట్టుకొన్న బంగాళదుంపలను ఫ్రైయింగ్ పాన్ లో వేసి తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.

4. తర్వాత పచ్చిమిర్చి ముక్కలను చిలకరించి మూత పెట్టాలి.

5. తక్కువ మంట మీద బంగాళదుంపలు 10-15నిముషాల దాకా, ఆవిరిమీదే ఉడికించుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.

6. బంగాళదుంప ముక్కలు మెత్తబడ్డాక స్టౌ ఆఫ్ చేసి సర్వ్ చేయాలి. అంతే సింపుల్ మసాలా ఆలూ ఫ్రై రెడీ. దీన్ని సైడ్ డిష్ గా సర్వ్ చేయవచ్చు.






Tags :
|
|
|
|

Advertisement