Advertisement

రుచికరమైన జీరా రైస్ తయారీ విధానం

By: Sankar Mon, 06 July 2020 1:28 PM

రుచికరమైన జీరా రైస్ తయారీ విధానం



జీరా అనగానే చాల మందికి తినడానికి అంతగా ఇష్టం ఉండదు ..కానీ జీరా తీసుకోవడం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి ..అందుకే జీరాతో రైస్ చేసుకోవడం వలన రుచికి రుచి ..ఆరోగ్యానికి ఆరోగ్యం ..ఇప్పుడు ఈ జీరా రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ..

కావాల్సిన పదార్ధాలు :

1 కప్ బియ్యం, 2 కప్ నీళ్ళు, అవసరాన్ని బట్టి ఆకుపచ్చని పచ్చిమిరప కాయలు, అవసరాన్ని బట్టి ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, గార్నిష్ కోసం కొన్ని జీడీ పప్పు పలుకులు

తయారీ విధానం :

1. ఓ కుక్కర్ తీసుకోండి.. అందులో సగం నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి వేడి అయిన తర్వాత జీలకర్ర వేసి వేయించండి. జీలకర్ర చిటపటలాడుతుండగా.. అందులోనే పచ్చిమిరపకాయలు వేసి వేయించండి. ఇప్పుడు ఆ పోపు మిశ్రమంలో కడిగిన బియ్యం వేసి, అన్ని పదార్థాలు కలిసే వరకూ ఓ నిమిషం పాటు వేయించండి.

2.బియ్యం కాస్తా వేగాక.. అందులో కొద్దిగా ఉప్పు వేయండి. ఇప్పుడు నీరు వేసి కుక్కర్ మూత పెట్టండి. ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించండి. ఇప్పుడు స్టౌ ఆపేసి కాసేపు ఆవిరిపై అలానే ఉంచండి. ఓ చిన్న పాన్ తీసుకుని అందులో కాస్తా నెయ్యి వేసి వేడి చేయండి. అందులోనే జీడిపప్పు వేసి వేయించండి.

3.ఇలా తయారైన జీరా రైస్‌ని ఓ గిన్నెలోకి తీసుకుని వేయించిన జీడిపప్పులు వేసి గార్నిష్ చేయండి. జీరా రైస్‌ని గ్రేవీతో కూడా కలిపి తీసుకోవచ్చు.

Tags :
|
|
|
|

Advertisement