Advertisement

పోషకాల గనులు రాగులతో దోశ ..

By: Sankar Wed, 08 July 2020 11:18 AM

పోషకాల గనులు రాగులతో దోశ ..



రాగులు అంత్యంత పోషక విలువలు కలిగినవి ..రాగులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. వీటి పిండితో తయారు చేసే రాగి దోశ ఎంతో టేస్టీగా ఉండడమే కాకుండా హెల్దీ కూడా. మరి ఆ దోశ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు చేద్దాం.

కావల్సిన పదార్ధాలు :

1 కప్ రాగి పిండి,

2 తరిగిన ఉల్లిపాయలు ,

1 చేతి నిండా కోయబడినవి కొత్తిమీర,

కరివేపాకు

ఆకుపచ్చని పచ్చిమిరప కాయలు

ఉప్పు తగినంత

అవసరాన్ని బట్టి నీళ్ళు

తయారీ విధానం :
ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో రాగిపిండిని వేయండి. ఇప్పుడు అందులో నీరు పోసుకుని దోశపిండిలా వచ్చేలా ఇలా పిండిని కలుపుకోండి

ఇప్పుడు కలుపుకున్న దోశ పిండిలోనే ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు తురుము, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేయండి. ఇప్పుడు పదార్థాలన్ని బాగా కలిసేలా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి.

దోశ పాన్ తీసుకుని మీడియం మంటపై పెట్టి వేడి చేయండి. ఇప్పుడు రాగి పిండిని తీసుకుని దోశలా వేయండి. ఇది మామూలు దోశపిండిలా వేయడానికి కుదరదు. కాబట్టి మీరు దోశ వేసుకునేటప్పుడే దోశ ఆకారంలో పిండిని వేయండి.

దోశని నెయ్యితో రెండు వైపులా 3 నుంచి 4 నిమిషాల పాటు కాల్చండి. అంతే ఎంతో హెల్దీ అంతే టేస్టీ రాగి దోశ సిద్ధమైనట్లే. ఈ దోశ ఏదైనా చట్నీతో, కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఎంతో బాగుంటుంది.


Tags :
|
|
|
|

Advertisement