Advertisement

  • వర్షాకాలంలో వేడి వేడి చికెన్ స్వీట్ కార్న్ సూప్

వర్షాకాలంలో వేడి వేడి చికెన్ స్వీట్ కార్న్ సూప్

By: Sankar Thu, 09 July 2020 10:56 AM

వర్షాకాలంలో వేడి వేడి చికెన్ స్వీట్ కార్న్ సూప్



సాధారణంగా వర్ష కాలం వచ్చింది అంటే వానలకు వేడిగా ఎదో ఒకటి తాగాలనిపిస్తుంది ..అయితే చాల మంది టీ లేదా కాఫీ తాగుతారు ..అయితే ఇవి ఎక్కువ తగిన ఆరోగ్యానికి నష్టమే మరి ఎలా అనుకుంటున్నారా అలంటి వారికోసమే వేడి వేడి సూప్స్ ఉన్నాయి ..ఈ సూపులు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తున్నాయి ..అయితే సూపులలో కూడా రకాలు ఉంటాయి .. కూరగాయలతోనే కాకుండా మాంసాహారంతో తయారు చేసే సూప్ లు కూడా చాలా రుచిగా ఉంటాయి. చికెన్ స్వీట్ కార్న్ సూప్ ఆరోగ్యంతో పాటు రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. కమ్మనైన రుచి ఘుభాళించే సువాసనతో చికెన్ స్వీట్ కార్న్ సూప్ మాంసాహార ప్రియులు రోజులో ఎప్పుడైనా తాగవచ్చు. తయారు చేయడం కూడా సులభమే.ఇప్పుడు చికెన్ స్వీట్ కార్న్ సూప్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ..

కావల్సినన పదార్థాలు: చికెన్ బ్రెస్ట్ - 100 గ్రాములు , క్యారెట్స్ - 1/2 కప్ , క్యాబేజ్ - 1/2 కప్, స్వీట్ కార్న్ కార్నెల్స్ - 2 కప్పులు , పెప్పర్ పౌడర్ - 1 టీస్పూన్ , చిల్లీ పౌడర్ - 1/2 టీస్పూన్ , కార్న్ ఫ్లోర్ - 1 టేబుల్ స్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: తగినంత


how,to make,chicken,sweet corn,recipe ,వర్షాకాలంలో,   చికెన్ , స్వీట్ కార్న్ , సూప్ ,  ఆరోగ్యం, రుచి,



తయారీ విధానం :

1. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నీరు పోయాలి. తర్వాత అందులో శుభ్రం చేసి పెట్టుకొన్న చికెన్ వేసి చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేయాలి.

2. ఒక నిముషం తర్వాత నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు పాన్ తీసుకొని, అందులో కొద్దిగా నూనె వేయాలి. వేడి అయిన తర్వాత అందులో స్వీట్ కార్న్, సన్నగా తరిగిన క్యాబేజ్ మరియు క్యారెట్ ముక్కలు వేయాలి.

4. తర్వాత 2లీటర్ల నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.

5. ఇప్పుడు వాటికి పెప్పర్ పౌడర్ మరియు చిల్లీ పౌడర్ వేసి మిక్స్ చేయాలి.

6. తర్వాత అందులోనే చికెన్ కూడా వేసి మిక్స్ చేయాలి.

7. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో నీరు మరియు కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఉండలు లేకుండా మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.

8. ఈ మిశ్రమాన్ని పాన్ లో వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలగలుపుకోవాలి.

9. ఈ మొత్తం మిశ్రమం అంతా 10-15నిముసాలు మెత్తగా ఉడకనివ్వాలి. అంతే హాట్ అండ్ స్పైసీ చికెన్ స్వీట్ కార్న్ సూప్ రెడీ.

Tags :
|

Advertisement