Advertisement

వేడి వేడి బ్రెడ్ సమోసా తయారీ విధానం

By: Sankar Sat, 25 July 2020 5:12 PM

వేడి వేడి బ్రెడ్ సమోసా తయారీ విధానం



వర్షాకాలం స్టార్ట్ అయింది అంటే సాయంత్రం అవ్వగానే వేడి వేడిగా ఎదో ఒకటి తినాలని అనిపిస్తుంది ..అయితే ఎప్పుడు రొటీన్ గా పకోడీలు , బజ్జిలు కాకుండా బ్రెడ్ తో వెరైటీ గా బ్రెడ్ సమోసా చేసుకొని తింటే , రుచి కి రుచి ఉంటుంది , రోజు తినే ఫుడ్ కి కొంచెం వెరైటీ జోడించినట్లు ఉంటుంది ..మరి బ్రెడ్ సమోసా ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా ..

కావాల్సిన పదార్ధాలు :

బ్రెడ్ స్లైస్లు - ఆరు బ్రెడ్ స్లైసులు, నూనె - సరిపడినంత, శెనగపిండి - ఒక కప్పు, పసుపు - పావు స్పూను, కారం - అర స్పూను, ఇంగువ - చిన్న ముక్క, ఉప్పు - తగినంత, నీళ్లు - తగినన్ని, ఉడకబెట్టిన బంగాళాదుంపలు - రెండు, నూనె - రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు - అర టీస్పూను, కరివేపాకులు - తగినన్ని, ఉడకబెట్టిన పచ్చ బఠానీలు - పావు కప్పు, పసుపు - చిటికెడు, అల్లం, పచ్చి మిరపకాయలు కలిపి చేసిన పేస్టు - ఒక టీ స్పూను, చిన్నగా తరిగిన కొత్తిమీర - ఒక టేబుల్ స్పూను, ఉప్పు - తగినంత

తయారీ విధానం :

ముందుగా సమోసా లోపల పెట్టడానికి ఆలు మసాలా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ..కళాయిలో నూనె వేడెక్కాక ఆవాలు, కరివేపాకు వేపాలి. తరువాత ఉడకబెట్టిన బంగాళాదుంపల్ని మెత్తగా పేస్టులా చేసి వేయాలి. అలాగే బఠానీలు, పసుపు, అల్లం-మిరపకాయల పేస్టు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. దానిని ఒకగిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత బ్రెడ్ సమోసా తయారీ కోసం ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి శెనగపిండి, పసుపు, కారం, ఉప్పు, ఇంగువ వేసి బాగా కలపాలి. మరీ పల్చగా, గట్టిగా కాకుండా మధ్యస్థం గా బజ్జీలు వేసేందుకు వీలుగా కలుపుకోవాలి. ఇప్పడు ఒక బ్రెడ్ స్లైసును తీసుకుని దానిపై ముందుగా తయారుచేసి పెట్టుకున్న ఆలూ మసాలా ముద్దని మందంగా పరుచుకోవాలి. దానిపై మరొక బ్రెడ్ స్లైసుని పెట్టి క్రాస్ గా పిరమిడ్ ఆకారంలో కత్తితో కట్ చేయాలి. వాటిని శెనగపిండి మిశ్రమంలో ముంచి, బాగా కాగిన నూనెలో వేయించాలి. కావల్సినన్ని చేసుకున్నాకా, బ్రెడ్ సమోసాని సాస్ తో తింటే అదిరిపోతుంది.




Tags :
|
|
|
|

Advertisement