Advertisement

  • రుచికి రుచి , ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే 'పోహా' తయారీ విధానం

రుచికి రుచి , ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే 'పోహా' తయారీ విధానం

By: Sankar Tue, 11 Aug 2020 2:08 PM

రుచికి రుచి , ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే 'పోహా' తయారీ విధానం



అటుకుల పులిహోర, అటుకుల ఉప్మా(పొహా) వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలిస్తే ఈ రోజు నుంచే మీ బ్రేక్‌ఫాస్ట్‌ జాబితాలో చేర్చేస్తారు. దేశంలో అత్యధిక ప్రజలకు ఇష్టమైన, ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా ఉందంటే అది పోహానే. అటుకులతో పాటు నిమ్మకాయ, పోపులు, పల్లీలు అందుబాటులో ఉంటే చాలు కేవలం పది నిమిషాల్లో పోహా తయారు చేసుకోవచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే అటుకుల ఉప్మా ప్రయోజనాలు, తయారీ విధానం గురించి తెలుసుకుందామా!

కావల్సిన పదార్థాలు:

అటుకులు- 1 కప్పు , పచ్చిమిర్చి - 3, పెద్ద ఉల్లిపాయ- 1/2, వేరుశెనగలు (పల్లీలు)- 2 టేబుల్ స్పూన్స్ , పచ్చి బఠాణి -3టేబుల్ స్పూన్స్, ఉప్పు-తగినంత, జీలకర్ర- 1/2 టీస్పూన్, వెల్లుల్లి ముక్కలు- 1/2 టీస్పూన్, పసుపు- 1/4 టీస్పూన్, కొత్తిమీర - కొద్దిగా, కరివేపాకు- 2 రెమ్మలు, నిమ్మరసం -2 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం :

1. అటుకులను ముందుగా నీళ్లతో శుభ్రం చేసి, నీరు లేకుండా పిండి పక్కన పెట్టాలి.

2. స్టవ్‌పై పెనం పెట్టి, తగినంత నూనె వేసి వేడిచేయాలి.

3. తర్వాత జీలకర్ర, వేరుశెనగ పప్పు, కరివేపాకు వేసి వేయించాలి.

4. తర్వాత ఉలిపాయ ముక్కలు, పచ్చి బఠాణి వేసి 5 నిమిషాలు వేయించుకోవాలి.

5. తర్వాత అటుకులు వేసి బాగా కలపాలి. చివరిగా ఉప్పు, నిమ్మరసం వేసి మరోసారి కలపాలి.

6. అంతే, గుమగుమలాడే.. అటుకుల ఉప్మా(పోహా) రెడీ!

7. మరిన్ని పోషకాల కోసం కూరగాయలతో కూడా పోహా తయారు చేసుకోవచ్చు

Tags :
|

Advertisement