Advertisement

  • ఇంట్లోనే ఎగ్ లెస్ కేక్ తయారు చేసుకునే విధానం..

ఇంట్లోనే ఎగ్ లెస్ కేక్ తయారు చేసుకునే విధానం..

By: Sankar Mon, 13 July 2020 3:00 PM

ఇంట్లోనే ఎగ్ లెస్ కేక్ తయారు చేసుకునే విధానం..



కేక్ ను ఇష్టపడనివారు చాలా తక్కువ మంది ఉంటారు ..వెజిటేరియన్స్ అయినా కూడా చాల మంది కేక్ ను చూస్తే అందులో ఎగ్స్ వేస్తారు అన్న విషయాన్నీ కూడా మరిచిపోయి లాగించేస్తారు ..అయితే ఇటివల కాలంలో ఇలా వెజిటేరియన్స్ కోసం ఎగ్స్ లేకుండా కేక్లను తయారు చేస్తున్నారు కానీ ఇవి అన్ని బేకరి లలో అందుబాటులో ఉండవు కేవలం పేరు గాంచిన బేకరీలే ఈ ఎగ్ లెస్ కేకులను తయారు చేస్తున్నాయి ..అయితే ఈ కరోనా కాలంలో ఆ ఎగ్ లెస్ కేకుల కోసం బయటకు వెళ్లి తిరగలేము కనుక ఎంచక్కా మన ఇంట్లోనే తయారు చేసుకుంటే అయిపోతుంది .. మరి ఇప్పుడు ఎగ్ లెస్ కేక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు

మైదాపిండి - 2 కప్పులు, పొడి చేసిన పంచదార - ఒకటిన్నర కప్పు, బేకింగ్‌పౌడర్‌: రెండున్నర టీ స్పూన్లు, పెరుగు: ముప్పావుకప్పు, నీళ్లు: అరకప్పు, వెన్న: అరకప్పు, వెనీలాఎసెన్స్‌ - టీస్పూను, ఉప్పు - పావుటీస్పూను

తయారీ విధానం :

ఒక గిన్నె తీసుకుని (కుక్కర్లో పట్టేది) అడుగు తడిలేకుండా తుడిచేయాలి. అడుగుకు నెయ్యి లేదా వెన్న పూసి కాస్త మైదాపిండి చల్లాలి.

మరో గిన్నె తీసుకుని అందులో మైదా, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి. అందులో పంచదారపొడి, వెన్న, వెనీలా ఎసెన్సు, నీళ్లు కూడా వేసి బాగా కలపాలి.

గరిటెతో కన్నా గిలక్కొడితే బెటర్. కావాలనుకుంటే కాస్త ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు కూడా వేసి బాగా గిలక్కొట్టాలి.

ఆ మొత్తం మిశ్రమాన్ని ముందుగా వెన్నరాసిన పాత్రలో పోయాలి. ఆ గిన్నెని కుక్కర్లో పెట్టి మూత పెట్టాలి.

కుక్కర్లో నీళ్లు పోయకూడదు. అలాగే కుక్కర్ మూతకి విజిల్ పెట్టాల్సిన అవసరం లేదు. ముందు ఒక రెండు నిమిషాలు పెద్దమంట మీద ఉంచి... తర్వాత చిన్న మంట మీద అరగంటసేపు ఉడికించాలి. అంతే ఎగ్ లెస్ కేసు సిద్ధమైనట్టే.

Tags :
|
|

Advertisement