Advertisement

  • సులువైన మరియు రుచికరమైన పన్నీర్ పులావ్ తయారీ విధానం ..

సులువైన మరియు రుచికరమైన పన్నీర్ పులావ్ తయారీ విధానం ..

By: Sankar Mon, 27 July 2020 11:44 AM

సులువైన మరియు రుచికరమైన పన్నీర్ పులావ్ తయారీ విధానం ..



శ్రావణ మాసం స్టార్ట్ అయింది అంటే చాల మంది ఆ నెల మొత్తం నాన్ వెజ్ తినకుండా ఉంటారు ..అయితే మరి పులావు , బిర్యానీ లాంటివి తినాలనిపిస్తే ఎలా అని ఆలోచిస్తున్నారా ..అలాంటి వారికోసమే రుచికరమైన పన్నీర్ పులావు ఉంది ..అందులోనూ పనీర్ తో చేసిన వంటలు ఎక్కువమందికి నచ్చుతాయి..మరి సులువైన పన్నీర్ పులావు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ..

కావాల్సిన పదార్ధాలు :

పనీర్ ముక్కలు - ఒక కప్పు, వండిన అన్నం - నాలుగు కప్పులు, క్యాప్సికమ్ ముక్కలు - కప్పు, ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టేబుల్ స్పూను, అజినో మోటో - చిటికెడు, వెన్న - రెండు స్పూన్లు, వెన్న - తగినంత, ఉప్పు - తగినంత..

తయారీ విధానం :

1. ముందుగా కళాయిలో వెన్న, నూనె వేసి అందులో పనీర్ ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి.

2. తరువాత అదే కళాయిలో ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, అజినోమోటో వేసి వేపాక, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి వేయించాలి.

3. కాస్త ఉప్పు వేస్తే ఇవి మంచిగా ఫ్రై అవుతాయి.

4. బాగా ఫ్రై అయ్యాక ముందుగా వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని కూడా చేర్చి బాగా కలపాలి.

5. వండిన అన్నాన్ని, సరిపడా ఉప్పుని కళాయిలో వేసి కలపాలి. కొంచెంసేపు ఉడికించిన తర్వాత వేడి వేడి పన్నీర్ పులవు రెడీ అవుతుంది ..

Tags :
|
|
|

Advertisement