Advertisement

బెండకాయ డీప్ ఫ్రై తయారీ విధానం

By: Sankar Sun, 26 July 2020 1:25 PM

బెండకాయ డీప్ ఫ్రై తయారీ విధానం



బెండకాయ పులుసు, ముక్కల వేపుడు... ఈ రెండే ఎక్కువగా బెండకాయతో చేసేవి. బెండకాయతో మంచి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. వీటినిలో అన్నంలోనే కాదు... సాయంత్రం పూట స్నాక్స్ లా కూడా తినొచ్చు.ఇపుడు ఈ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూదాం

కావాల్సిన పదార్ధాలు :

బెండకాయలు - పది, ఉల్లిపాయలు (సన్నగా తరిగినవి) - అరకప్పు, క్యాప్సికమ్ (సన్నగా తరిగినవి) - అర కప్పు, కారం - ఒక టీస్పూను, గరం మసాలా - అర టీస్పూను, కార్న్ ఫ్లోర్ - అర టీస్పూను, ధనియాల పొడి - పావు స్పూను, బియ్యం పిండి - పావు కప్పు, కొత్తిమీర (సన్నగా తరిగాలి) - పావు స్పూను, నూనె - తగినంత, ఉప్పు- రుచికి సరిపడా

తయారీ విధానం :

1. బెండకాయలను నిలువుగా నాలుగు ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

2. ఒక గిన్నెలో గరం మసాలా, కార్న్ ఫ్లోర్, బియ్యంపిండి, ధనియాల పొడి, కారం, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, కొంచెం నీళ్లు పోసి బాగా కలపాలి.

3. ఆ మిశ్రమంలో బెండకాయ ముక్కల్ని మారినేట్ చేయండి. ఓ పావుగంట సేపు అలా వదిలేయండి.

4. స్టవ్ పై కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి. నూనె వేడెక్కా బెండకాయ ముక్కల్ని బజ్జీలు వేసినట్టు వేయాలి. అవి గోల్డ్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేగనివ్వాలి. వాటిని స్నాక్స్ లా పిల్లలకి పెట్టొచ్చు.


Tags :
|
|

Advertisement