Advertisement

అటుకుల వడలు తయారీ విధానం

By: Sankar Thu, 10 Sept 2020 8:31 PM

అటుకుల వడలు తయారీ విధానం


అటుకులు సాయంత్రం స్నాక్ ఐటెం గా , చాల ప్రాంతాలలో పొద్దున్న టిఫిన్ లాగ తింటుంటారు అయితే అటుకులతో వడలు కూడా తయారు చేయవచ్చు అవి ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

కావాల్సిన పదార్దాలు :
అటుకులు – 1 కప్పు(నీళ్లలో తడిపి పిండుకోవాలి)

ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్లు

శనగపిండి – 1 టేబుల్‌ స్పూన్

బియ్యప్పిండి – 2 టేబుల్‌ స్పూన్లు

అల్లం పేస్ట్‌ – 1 టీ స్పూన్

పచ్చిమిర్చి పేస్ట్‌ – ఒకటిన్నర టీ స్పూన్లు

పసుపు – పావు టీ స్పూన్

జీలకర్ర – అర టీ స్పూన్‌

కొత్తిమీర తురుము –3 టేబుల్‌ స్పూన్లు

ఉప్పు – తగినంత

నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా

తయారీ విధానం :

1. ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, అటుకులు, బియ్యప్పిండి, శనగపిండి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి.

2. పసుపు, జీలకర్ర, కొత్తిమీర తురుము, ఉప్పు వేసుకుని మరోసారి కలుపుకోవాలి.

3. అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు వేసుకుని ముద్దలా చేసుకోవాలి.

4. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకుని చేతులతో వడల్లా ఒత్తుకుని నూనెలో డీప్‌ఫ్రై చేసుకుంటే రుచిగా ఉంటాయి

Tags :
|
|
|

Advertisement