Advertisement

తియ్యటి మీఠా పారే తయారీ విధానం

By: Sankar Tue, 16 June 2020 4:14 PM

తియ్యటి మీఠా పారే తయారీ విధానం



ఉత్తర భారత దేశంలో ఎక్కువగా ఇష్టపడే స్వీట్లలో ఒకటి మీఠా పారే ..దీనినే షక్కర్ ‌పారా, షక్కర్‌ పారే అని కూడా అంటారు..ఇది ఎలా తయారు చేసుకోవాలో చూదాం ..

కావాల్సిన పదార్ధాలు :

250 గ్రాములు మైదా
3 టీ స్పూన్ నెయ్యి
1/2 కప్ చక్కర
డీప్ ఫ్రై కు సరిపడా నూనె
అవసరాన్ని బట్టి నీళ్ళు

తయారీ విధానం :

ఒక గిన్నెను తీసుకుని, అందులో నీరు, చక్కెర వేసి బాగా కలపండి. చక్కెర పూర్తిగా నీటిలో కరిగేవరకు కలపండి.

ఈ మిశ్రమంలో నెయ్యిని వేసి 3 నుండి 4 నిమిషాలపాటు మళ్లీ కలపండి. ఆపై అందులో మైదాని వేసి మెత్తని పిండిగా తయారుచేసుకోండి. ఈ పిండి మెత్తగా మారిన తర్వాత, 1 నుండి ఒకటిన్నర గంటల పాటు పక్కన ఉంచండి..

కొంత సమయం తరువాత, రోలింగ్ ప్లేట్ (చపాతీ పీట) మీద పిండిని వేసి, పిండిని చిన్ని చిన్ని భాగాలుగా తయారు చేయండి. రోలింగ్ పిన్‌కు నూనె రాసి, పిండిని మందంగా ఫ్లాట్‌బ్రెడ్‌ లా చేయండి.

ఈ ఫ్లాట్ బ్రెడ్ ను మీరు కోరుకున్న ఆకారంలో కట్ చేసి, బంగారు గోధుమ రంగు వచ్చేవరకు పాన్‌లో వేయించండి. టీ, సాయంత్రం స్నాక్స్ తో ఈ క్రంచీ మీథే పారేను సర్వ్ చేయండి.


Tags :
|
|

Advertisement