Advertisement

  • వేడి వేడి ఆరోగ్యకరమైన మిక్స్డ్ స్ప్రౌట్స్ పులావ్

వేడి వేడి ఆరోగ్యకరమైన మిక్స్డ్ స్ప్రౌట్స్ పులావ్

By: chandrasekar Fri, 21 Aug 2020 5:12 PM

వేడి వేడి ఆరోగ్యకరమైన మిక్స్డ్ స్ప్రౌట్స్ పులావ్


కావలసినపదార్థాలు:

నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు
స్మతి బియ్యం – ఒక కప్పు
లవంగాలు – 2
ఏలకులు – 1
దాల్చిన చెక్క – చిన్న ముక్క
బిర్యానీ ఆకు – 1
ఉల్లి తరుగు – అర కప్పు
తరిగిన పచ్చి మిర్చి – 3
అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను
క్యాప్సికమ్‌ తరుగు – అర కప్పు
టొమాటో తరుగు – అర కప్పు
మిక్స్‌డ్‌ స్ప్రౌట్స్‌ – ఒక కప్పు
చెన్నా మసాలా – అర టీ స్పూను
చాట్‌ మసాలా – అర టీ స్పూను
ఉప్పు – తగినంత
మిరప కారం – ఒక టీ స్పూను
జీలకర్ర పొడి – ఒక టీ స్పూను
ధనియాల పొడి – ఒక టీ స్పూను
నీళ్లు – మూడున్నర కప్పులు
కొత్తిమీర తరుగు – కొద్దిగా
పుదీనా – కొద్దిగా

తయారు చేయువిధానం:

స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కాగాక లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. ఉల్లి తరుగు, తరిగిన పచ్చిమిర్చి వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి వేయించాలి. క్యాప్సికమ్‌ తరుగు, టొమాటో తరుగు, మిక్స్‌డ్‌ స్ప్రౌట్స్‌ వేసి బాగా వేయించాలి. చెన్న మసాలా, చాట్‌ మసాలా, ఉప్పు, మిరప కారం వేసి బాగా కలియబెట్టాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మరోమారు కలపాలి. మూడున్నర కప్పుల నీళ్లు పోసి, బాగా మరిగిన తరవాత కడిగి ఉంచుకున్న బియ్యం వేసి కలిపి, ఉడికించాలి. కొద్దిగా ఉడికిన తరవాత కొత్తిమీర, పుదీనా తరుగు వేసి, మూత ఉంచి ఉడికించాలి పావు గంట తరవాత మూత తీసి, ప్లేట్‌లోకి తీసుకోవాలి. వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.

Tags :
|
|

Advertisement