Advertisement

వేడి వేడి చిల్లీ బజ్జీ

By: chandrasekar Thu, 25 June 2020 7:21 PM

వేడి వేడి చిల్లీ బజ్జీ


బజ్జీ నచ్చని వారు ఎవరు వుండరు. రుచి కరమైన చిల్లీ బజ్జి వేడి వేడిగా కాఫీ త్రాగడానికి ముందు తింటే ఆ రుచే వేరే లెవెల్లో ఉంటుంది. బజ్జీ ఈవెనింగ్ టైమ్‌లో మంచి స్నాక్ ఐటెమ్ అని చెప్పొచ్చు. ఇంట్లో అందుబాటులో ఉన్న పదార్థాలతోనే ఈ స్నాక్ ఐటెమ్‌‌‌‌ని ఈజీగా చేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:

సెనగ పిండి: కావలసినంత
చిల్లీ: కావలసినంత
అవసరాన్ని బట్టి చిల్లీ పికిల్
బియ్యం పిండి: 1 టేబుల్ స్పూన్
నీళ్ళు: కావలసినంత
నూనె: కావలసినంత
సోంపు: 1 టీ స్పూన్
కారప్పొడి: 1 టీ స్పూన్
ఉప్పు: కావలసినంత
పసుపు: కావలసినంత
ఇంగువ: ఒక చిటికెడు
తాయారు చేయు విధానం:

ముందుగా ఓ పాత్ర తీసుకుని శనగపిండి, బియ్యం పిండి, పసుపు, కారం, ఉప్పు, ఇంగువ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయండి, వీటన్నింటిని ముందుగానే ఓ సారి కలపండి. ఇప్పుడు పిండి మిశ్రమంలో ఓ స్పూన్ ఆయిల్ వేసి మరోసారి కలపండి. ఇందులో నీరు పోసి బజ్జీల పిండిలా కలపండి.

ఇప్పుడు పచ్చి మిర్చిలకు మధ్యలో చీల్చండి. మధ్యలో కొద్దిగా కారం రాయండి. ఇలా చేయడం వల్ల బజ్జీలు స్పైసీగా, టేస్టీగా వస్తాయి. ఇప్పుడు పాన్ తీసుకుని నూనె వేసి వేడి చేయండి. నూనె వేడి అయిన తర్వాత మిర్చిలను పిండిలో ముంచి నూనెలో వేయండి. వీటిని కాస్తా దోరగా వేయించండి. వీటిని వేడివేడిగా టమాటా సాస్‌తో కానీ, ఉల్లిపాయ కాంబినేషన్‌తో సర్వ్ చేయండి.

Tags :
|
|
|
|

Advertisement