Advertisement

  • హేయల్తీ ‌డేట్‌ యాపిల్‌ స్క్వేర్స్ స్వీట్స్

హేయల్తీ ‌డేట్‌ యాపిల్‌ స్క్వేర్స్ స్వీట్స్

By: chandrasekar Mon, 22 June 2020 5:54 PM

హేయల్తీ  ‌డేట్‌ యాపిల్‌ స్క్వేర్స్ స్వీట్స్


ఆరోగ్యానికి ఖర్జూరం మరియు ఆపిల్ అనేక రకాలుగా మేలు చేస్తుంది. వీటిని ఉపయోగించి మంచి రుచికరమైన మరియు మంచి పోషక విలువలు కలిగిన డేట్‌ యాపిల్‌ స్క్వేర్స్ ను ఎలా తాయారు చేయాలో తెలిసికుందాం. దీనిని పిల్లలు మరియు పెద్దలు తినడానికి చాల రుచి కరంగా ఉంటుంది.

కావలసిన పదార్థాలు:
* ఖర్జూరం ముక్కలు – 2 కప్పులు – గింజలు తొలగించి, మిక్సీలో గుజ్జు చేసుకోవాలి
* యాపిల్‌ గుజ్జు – అర కప్పు
* బ్రౌన్‌ సుగర్‌ – ఒకటిన్నర కప్పులు
* నీళ్లు – ఒకటిన్నర కప్పులు
* నిమ్మరసం – 1 టేబుల్‌ స్పూన్‌
* బటర్‌ – 1 కప్పు
* ఓట్స్‌ పిండి కావలసినంత
* బియ్యం పిండి కావలసినంత
* మొక్కజొన్న పిండి – పావు కప్పు
* వాల్‌నట్ – కావలసినన్ని
* జీడిపప్పు – 2 లేదా 3 టేబుల్‌ స్పూన్లు ముక్కలుగా చేసినవి
* కొబ్బరి తురుము – పావుకప్పు

తయారుచేయు విధానం:

ఒక పాన్‌ బౌల్‌ తీసుకుని అందులో నీళ్లు, అర కప్పు బ్రౌన్‌ సుగర్‌ వేసుకుని, గరిటెతో తిప్పుతూ కలపాలి. కాసేపటికి ఖర్జూరం గుజ్జు వేసుకోవాలి. తర్వాత నిమ్మరసం కూడా వేసుకుని దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్‌ తీసుకుని అందులో బటర్, ఒక కప్పు బ్రౌన్‌ సుగర్, బియ్యం పిండి, ఓట్స్‌ పిండి, కొబ్బరి తురుము, మొక్కజొన్న పిండి, వాల్‌నట్, జీడిపప్పు పౌడర్‌ వేసుకుని కలుపుకోవాలి. తర్వాత యాపిల్‌ గుజ్జు కూడా వేసుకుని బాగా కలుపుకుని, ఒకటిన్నర లేదా రెండు అంగుళాల లోతున్న చతురస్ర లేదా దీర్ఘచతురస్రాకారపు ట్రే తీసుకుని అందులో బటర్‌ మరియు యాపిల్‌ మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుని, దానిపైన ఖర్జూరం మిశ్రమాన్ని వేసుకుని సమాంతరం చేసుకోవాలి. తర్వాత మిగిలిన బటర్‌ మిశ్రమాన్ని కూడా వేసుకుని మరోసారి సమాంతరం చేసుకుని, 25 నుంచి 30 నిమిషాల పాటు ఓవెన్‌లో ఉడికించుకుని చతురస్త్రాకారంలో (స్క్వేర్స్) గా కట్‌ చేసుకోవాలి.

Tags :
|
|

Advertisement