Advertisement

  • ఒంటికి చల్లదనాన్ని అందించే ఫ్రూట్‌ యోగర్ట్‌

ఒంటికి చల్లదనాన్ని అందించే ఫ్రూట్‌ యోగర్ట్‌

By: chandrasekar Tue, 04 Aug 2020 6:28 PM

ఒంటికి చల్లదనాన్ని అందించే ఫ్రూట్‌ యోగర్ట్‌


సమ్మర్ సీజన్లో తీసుకోవాల్సిన ఆహారం వేరే ఉంటుంది. ఈ సీజన్లో ఒళ్ళు వేడిచేస్తూ ఉంటుంది. ఒంటికి చల్లదనాన్ని అందించే ఆహారాన్ని తీసుకోవాలి. ఇదిగో ఈ ఫ్రూట్ యోగర్ట్ (పెరుగు) చేసుకుని తినండి.

కావాల్సిన పదార్థాలు

పుచ్చాకయ ముక్కలు - రెండు కప్పులు
పెరుగు (గట్టిది) - ఒక కప్పు
కండెన్స్ డ్ మిల్క్ క్రీమ్ - రెండు టీస్పూనులు
నిమ్మరసం - అర టీస్పూను
చక్కెర - రెండు టీస్పూనులు
తేనె - ఒక టేబుల్ స్పూను
తయారుచేసే విధానం:

పుచ్చకాయను గింజలు తీసేసి ముక్కలు కోసుకోవాలి. వాటిని గిన్నెలో వేసి డీఫ్ ఫ్రిజ్ లో రాత్రంతా పెట్టాలి. అవి మంచుముక్కల్లా ఫ్రీజ్ అవుతాయి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఈ పుచ్చకాయ ముక్కలు, పంచదార, మిల్క్ క్రీమ్, పంచదార, నిమ్మరసం వేసి బాగా తిప్పాలి. మెత్తటి పేస్టులా అవుతుంది. దీనిని తీసి ఒక గిన్నెలో వేసి డీఫ్రీజ్ లో గంటసేపు ఉంచాలి. ఆ తరువాత మళ్లీ బయటికి తీసి మిక్సీలో వేయాలి. ఆ పేస్టు ఇంకా మృదువుగా అవుతుంది. దానిని గిన్నెలో వేసి మళ్లీ డీప్ ఫ్రిజ్ లో పెట్టాలి. ఇలా రెండు మూడు సార్లు ఫ్రిజ్ లో పెట్టి తీసి, మిక్సీ వేసి ఇలా చేస్తుంటే అది ఐస్ క్రీములా తయారవుతుంది. అంతే ఫ్రూట్ యోగర్ట్ సిద్ధమైనట్టే. దానిలో చిన్న పండ్ల ముక్కలు వేసుకుని తింటే భలే రూచికరంగా ఉంటుంది.

Tags :
|
|
|

Advertisement