Advertisement

ఎగ్ ప్రియుల కోసం 'ఎగ్‌ 65'

By: chandrasekar Sat, 08 Aug 2020 09:44 AM

ఎగ్ ప్రియుల కోసం 'ఎగ్‌ 65'


ఈ 'ఎగ్ 65' ఏంటో చూద్దాం. మాంసాహారం తిననివారు, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే గుడ్డుతో చేసేదే ఈ 'ఎగ్ 65'. ఇది మంచి రుచిగా ఉండటంతోపాటు ఆరోగ్యానికి మేలుకూడా చేస్తుంది. ఎగ్ తినేవారి కోసం ప్రత్యేకించిన ఈ వంటకాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం

కావాల్సిన పదార్థాలు:

గుడ్లు: 6
కార్న్ఫ్లోర్: 1 లేదా 2 కప్పులు
పెరుగు: 2 కప్పులు
అల్లం: 2 ముక్కలు
వెల్లుల్లి: 6 - 10 రెబ్బలు
పచ్చిమిర్చి: 6
కొత్తిమీర: కప్పు
కరివేపాకు: కప్పు
గరం మసాలా: 4 టీ స్పూన్లు
కారం పొడి: సరిపడినంత
కశ్మీరీ కారంపొడి: 2 టీ స్పూన్లు
ఉప్పు: సరిపడా
చిల్లీ సాస్: కొద్దిగా
జీలకర్ర పొడి: 2 టీ స్పూన్లు
చక్కెర: 2 టీ స్పూన్లు

తయారీ విధానం:

గుడ్లు ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత గుడ్డులో నుంచి పచ్చసొన వేరుచేసి, తెల్లగుడ్డు మాత్రమే తీసుకుని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలకు సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కారం, గరంమసాలాతోపాటు కొద్ది పరిమాణంలో బ్రెడ్ పౌడర్, కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. రెండు పగుల గొట్టిన గుడ్ల నుంచి తీసిన తెల్లసొన (ఎగ్ వైట్)ను ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. స్టౌ వెలిగించుకుని బాణలిలో నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత ఈ ఉండలను నూనెలో వేసుకోవాలి. బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.

మరో ప్యాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడెక్కగానే అందులో తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. పచ్చి మిర్చిని రెండుగా చీల్చినవే వేసుకోవాలి. కాసేపు వేగాక ఇందులో కప్పు పెరుగు వేసుకోవాలి. తరువాత ఇందులో కాస్తా కశ్మీరీ కారం పొడి, గరం మసాలా, జీలకర్ర పొడితోపాటు కొద్దిగా చిల్లీ సాస్ వేసుకోవాలి. కొద్దిగా చక్కెర వేస్తే రుచికి బాగుంటుంది. తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకొని చివరగా ముందుగా ఫ్రైచేసి పెట్టుకున్న ఉండలను వేసేయాలి. మంట కాస్తా పెంచి ముక్కలకు గ్రేవీ బాగా పట్టేవరకు ప్యాన్‌ను అటు ఇటూ కదపడం చేయాలి. బాగా ఉడికింది అనుకుంటే వెంటనే స్టౌ ఆర్పేయాలి. ఇప్పుడు టేస్టీ ఎగ్ 65 రెడీ.

Tags :
|
|

Advertisement