Advertisement

  • టేస్టీగా వుండే ధాబా స్టయిల్ క్యాలీఫ్లవర్ తయారీ విధానం

టేస్టీగా వుండే ధాబా స్టయిల్ క్యాలీఫ్లవర్ తయారీ విధానం

By: chandrasekar Fri, 21 Aug 2020 5:07 PM

టేస్టీగా వుండే  ధాబా స్టయిల్ క్యాలీఫ్లవర్ తయారీ విధానం


కావలసినవి పదార్థాలు:

* క్యాలీ ఫ్లవర్‌ – 1
* బంగాళ దుంప – 1
* క్యాప్సికమ్‌ తరుగు – పావు కప్పు
* టొమాటో తరుగు – పావు కప్పు
* కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు
* ధనియాల పొడి – ఒక టే బుల్‌ స్పూను
* జీలకర్ర పొడి – ఒక టీ స్పూను
* గరం మసాలా – ఒక టీ స్పూను
* నూనె – 6 టేబుల్‌ స్పూన్లు
* ఇంగువ – పావు టీ స్పూను
* పసుపు – అర టీ స్పూను
* మిరప కారం – 2 టీ స్పూన్లు
* అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్‌ స్పూను
* ఉప్పు – కావలసినంత

తయారీవిధాన౦:

గోరు వెచ్చని నీటిలో క్యాలీఫ్లవర్‌ ముక్కలు వేసి శుభ్రంగా కడగాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఇంగువ, పసుపు, బంగాళ దుంప ముక్కలు వేసి బాగా వేయించి, ముక్కలు మెత్తపడేవరకు మూత ఉంచాలి. క్యాలీ ఫ్లవర్‌ తరుగు, ఉప్పు జత చేసి బాగా కలిపి మరో పది నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. క్యాప్సికమ్‌ తరుగు జత చేసి మరో ఐదు నిమిషాలు ఉంచాలి. మిరప కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి బాగా కలియబెట్టాలి. టొమాటో తరుగు జత చేసి మరోమారు కలిపి, ముక్కలు మెత్తబడేవరకు ఉంచాలి. కొత్తిమీర తరుగు జత చేసి దింపేయాలి. గోబీ ధాబా స్టయిల్‌ కూర రెడీ.

Tags :
|

Advertisement