Advertisement

జొన్నరవ్వతో రుచికరమైన ఉప్మా

By: chandrasekar Tue, 14 July 2020 6:17 PM

జొన్నరవ్వతో రుచికరమైన ఉప్మా


మనం సేమియా,రవ్వ తో ఉప్మా చేసికుంటూనే ఉంటాము. జొన్నరవ్వ తో కూడా ఉప్మా చేయవచ్చు. ఈ రవ్వ ఉప్మా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జొన్న రవ్వతో ఉప్మా చేయడం ఎలాగో తెలుసుకుందాము.


కావలసిన పదార్థాలు :



జొన్న రవ్వ: 100 గ్రా.
పచ్చి శనగపప్పు: 7 గ్రా.
వేరుశనగ పప్పు: 25 గ్రా.
ఆవాలు: 5 గ్రా.
జీలకర్ర: 8 గ్రా.
కరివేపాకు: 5 గ్రా.
ఉల్లిపాయలు: 20 గ్రా.
పచ్చిమిర్చి: 5 గ్రా
నీళ్లు: 4 కప్పులు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె 20 గ్రా.


తయారు చేసే విధానం :


ఒక బాణలిలో 2 టేబుల్‌ స్పూన్ల నూనె పోసి జొన్న రవ్వను 2 నిమిషాలు దోరగా వేయించి పక్కన పెట్టాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేసి తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 5 ని. వేగనివ్వాలి. రుచికి తగినంత ఉప్పు వేసి 4 కప్పుల నీళ్లు పోసి మరగనివ్వాలి. మరుగుతున్న నీళ్ళలో రవ్వ వేసి సన్నని సెగపై 5-10 ని. ఉడకబెట్టాలి. యిప్పుడు రుచికరమైన ఉప్మా రెడీ.

Tags :
|
|

Advertisement