Advertisement

రుచికరమైన రస్క్ పాయసం

By: chandrasekar Tue, 18 Aug 2020 9:01 PM

రుచికరమైన రస్క్ పాయసం


మాములుగా పాయసం సేమియాతో ముఖ్యంగా తయారు చేస్తూ వుంటారు. కానీ ఇప్పుడు రస్కుతో పాయసం ఎలా తయారు చెయ్యాలో చూస్తాం. మాములుగా రస్కు కీర్ అంటే చాలా మంది ఇష్టపడతారు. వీటితోనే పాయసం చేసుకుంటే బావుంటుంది కదా అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:

రస్కు - 4
పాలు - 1 కప్
యాలకుల పొడి - కొంచం
జీడిపప్పు - కావలసినన్ని
ఎండు ద్రాక్ష - కావలసినన్ని
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
చక్కర - 4 టీ స్పూన్

తయారు చేయు విధానం:

ముందుగా రస్కులను తీసుకుని మిక్సీజార్‌లో వేసి పొడి చేయండి. ఆ తర్వాత ఓ పాన్ తీసుకుని అందులో నెయ్యి వేసి చిన్న మంటపై వేడిచేయండి. నెయ్యి వేడి కాగానే జీడిపప్పులు, ఎండుద్రాక్షలు వేసి వేయించండి. రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత క్రష్ చేసిన రస్కుని వేసి వేయించాలి. ఆ తర్వాత అందులో పాలు వేయండి. అనంతరం ఉండలు లేకుండా బాగా కలపండి. ఇప్పుడు మిశ్రమం కొద్దిగా చిక్కబడిన తర్వాత పంచదార వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిశ్రమం పాయసంలా ఇలా తయారవుతుంది.

అందులో యాలకుల పొడి వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించండి. ఇలా తయారైన పాయసాన్ని సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకోండి. ఆ తర్వాత పై నుంచి డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేయండి. ఇలా తయారైన వేడివేడి రస్కు పాయసాన్ని సర్వ్ చేయండి. అవసరమైతే బాదాం, పిస్తా పప్పులు కూడా వేసి గార్నిష్ చేసికోవచ్చు.

Tags :
|

Advertisement