Advertisement

రుచికరమైన నోరూరించే కొబ్బరి లడ్డూ

By: chandrasekar Sat, 15 Aug 2020 5:05 PM

రుచికరమైన నోరూరించే కొబ్బరి లడ్డూ


కావాల్సినవి పదార్థాలు:

పాలు - ఒక లీటరు
బొంబాయి రవ్వ - అరకప్పు
కొబ్బరికాయ-1
చక్కెర - తగినంత
యాలకుల పొడి - రెండు చిటికెలు
నెయ్యి - తగినంత

తయారీ విధానం:

ముందుగా కొబ్బరి తురుము తీసుకుని పక్కనపెట్టుకోవాలి. బొంబాయి రవ్వలో కొద్దిగా నెయ్యి వేసి వేయించుకోవాలి. ఒక పాత్రలో నీరు కలపని పచ్చిపాలు, కొబ్బరి తురుము, చక్కెరను వేసి మరగనివ్వాలి. ఆ మిశ్రమం చిక్కబడే సమయంలో బొంబాయి రవ్వ, యాలకుల పౌడర్ ను వేసి బాగా కలపాలి. కొన్ని నిమిషాల తర్వాత ఆ పాత్రను గ్యాస్ మీద నుండి తీసి చల్లారిన తర్వాత లడ్డూలుగా తయారు చేసుకుంటే అంతే రుచికరమైన కొబ్బరి లడ్డూలు రెడీ.

Tags :

Advertisement