Advertisement

  • పాలతో తాయారు చేసే రుచికరమైన మిల్క్ కేక్

పాలతో తాయారు చేసే రుచికరమైన మిల్క్ కేక్

By: chandrasekar Thu, 17 Sept 2020 09:39 AM

పాలతో తాయారు చేసే రుచికరమైన మిల్క్ కేక్


మన దేశంలో పాలతో అనేక రకాల వంటకాలు తాయారు చేస్తారు. ఇప్పుడు ఈ పాలను వుపయోగించి కేక్ చేసుకుందాం. పాలతో చేసే టేస్టీ స్వీట్ మిల్క్ కేక్. పూర్తిగా పాలతోనే చేస్తాం కనుక పిల్లలకు ఇది రుచితో బాటు బలాన్ని కూడా ఇస్తుంది. ఈ రుచికరమైన మంచి పోషకాలు వున్న ఈ మిల్క్ కేక్ ఎలా తాయారు చేయాలో చూస్తాం.

చేయడానికి కావాల్సిన పదార్థాలు:

పాలు - అరలీటరు
పంచదార - పావు కప్పు
నిమ్మరసం - ఒక స్పూను
పిస్తా - కావలసినంత
బాదం - కావలసినంత

టేస్టీ స్వీట్ మిల్క్ కేక్ తయారు చేసే విధానం:

స్టవ్ వెలిగించి ఒక మందంగా ఉండే పాత్రలో పాలు పోసి స్టవ్ మీద పెట్టాలి. చిన్న మంట మీద పాలను మరిగించాలి. నిమ్మరసాన్ని పిండి నీళ్లలో కలిపి ఉంచాలి. పాలు మరుగుతున్నప్పుడు ఒక్కో చుక్కని అదులో కలుపుతూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ పోస్తే పాలు విరిగిపోతాయి. కనుక పాలు విరిగిపోకుండా ఒక్కో చుక్క వేస్తూ కలుపుతూ ఉండాలి. పాలు చిక్కబడే వరకు ఇలా చేయాలి.

వేడిచేయడంతో పాలు క్రమంగా చిక్కబడుతున్నప్పుడు అందులో పంచదార కలపాలి. తరువాత కూడా కోవాలా అయ్యే వరకు మరిగించాలి. కోవాలా దగ్గరకు చేరాక స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు ఒక ప్లేటు అడుగుకు నెయ్యి రాసి బాదం పిస్తా ముక్కలు చల్లాలి. దానిపై కోవా మిశ్రమాన్ని వేయాలి. ఒక ఆకారంలో ఆ మిశ్రమాన్ని సర్ది చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అంతే టేస్టీ స్వీట్ మిల్క్ కేక్ రెడీ.

Tags :
|
|
|

Advertisement