Advertisement

  • మామిడి పండ్లతో రుచికరమైన మ్యాంగో స్పాంజ్‌ కేక్‌

మామిడి పండ్లతో రుచికరమైన మ్యాంగో స్పాంజ్‌ కేక్‌

By: chandrasekar Tue, 21 July 2020 11:14 AM

మామిడి పండ్లతో రుచికరమైన మ్యాంగో స్పాంజ్‌ కేక్‌


వేసవి కాలం మామిడిపండ్ల సీజన్. ఏ సీజన్లో వచ్చే పండ్లని ఆ సీజన్ లో తినాలి. మామిడిపండ్లతో ఏ వంటకం చేసుకోవాలన్నా ఇప్పుడే చేసుకోవాలి. మామిడి పండ్లతో కేకు కూడా తాయారు చేయవచ్చు. ఎలా చేయాలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు

మామిడి పండ్ల గుజ్జు - ఒక కప్పు
గోధుమ పిండి - ఒక టేబుల్ స్పూను
మైదా - అరకప్పు
బేకింగ్ సోడా - ఒక టీస్పూను
వెన్న - మూడు టీస్పూనులు
కోడి గుడ్డు - ఒకటి
పంచదార - రెండు టీస్పూనులు
వెనిల్లా ఎసెన్సు - ఒక టీస్పూను
చాకో చిప్స్ - మూడు టేబుల్ స్పూన్లు
ఉప్మా రవ్వ - ఒక టేబుల్ స్పూనులు

తయారు చేసే విధానం

ఒక బౌల్ లో మామిడిగుజ్జు, కోడిగుడ్ల సొన, వెన్న, పంచదార, వెనిల్లా ఎసెన్సు వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో గోధుమపిండి, చాకోచిప్స్, మైదా, బేకింగ్ సోడా, ఉప్మారవ్వ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మైదా మిశ్రమాన్ని, మామిడి గుజ్జు మిశ్రమాన్ని కలిపేయాలి. ఉండలకు కట్టకుండా బాగా గిలక్కొట్టాలి. కేక్ మౌల్డ్ లో కింద వెన్న రాసి ఈ మిశ్రమాన్ని వేయాలి. ఓవెన్ లో 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల వేడి చేయాలి. అనంతరం బయటికి తీస్తే మ్యాంగో స్పాంజ్ కేక్ తినడానికి సిద్ధంగా ఉంది.

Tags :
|
|

Advertisement