Advertisement

ద్రాక్షతో రుచికరమైన హల్వా

By: chandrasekar Mon, 15 June 2020 4:04 PM

ద్రాక్షతో రుచికరమైన హల్వా


నల్ల ద్రాక్షల్లో విటమిన్స్, మినలర్స్, యాంటీఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నల్ల ద్రాక్షలు మన గుండెను రోగాల నుంచీ కాపాడతాయి. హైబీపీని కంట్రోల్ చెయ్యడానికి బ్లాక్ కరంట్స్ సహాయపడతాయి. శరీరంలో రక్తం సరిగా లేనివారు నల్ల ద్రాక్షలు తింటే మేలు. ఇన్ని మేలు కలిగించే ద్రాక్ష ద్వారా హల్వా ఎలా తాయారు చేయాలో చూస్తాం.

కావలసిన పదార్ధాలు:

* నల్లద్రాక్షలు - వంద గ్రాములు

* మైదా - పావుకేజీ

* పంచదార - పావుకేజీ

* జీడిపప్పులు - కావలసినంత

* పిస్తా పప్పులు - కావలసినంత

*బాదం పప్పులు - కావలసినంత

* నెయ్యి - కావలసినంత

తయారీ విధానం:

ముందుగా మైదాపిండిలో కొద్దిగా నీళ్ళుపోసి ముద్దలా కలపాలి. కలిపిన ముద్దలో మూడు కప్పుల నీళ్ళు పోసి పూర్తిగా నీళ్ళలో కలిసేలా బాగా కలిపి పక్కన పెట్టాలి (మైదా పాలుగా అవ్వటానికి) అరగంటకి కలిపిన మైదాలో నీళ్ళు పైకి తేరుకుంటాయి. తేరుకున్న నీరు తీసేస్తే, అడుగున మైదా పాలు వుంటాయి. ద్రాక్షలో గింజలు తీసి మిక్సి లో వేసి జ్యూస్ లా చేసి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి బాండి పెట్టి పంచదార, కొద్దిగా నీళ్ళు పోసి పాకం పట్టాలి. తీగ పాకం వచ్చాక మైదా పాలు, ద్రాక్ష జ్యూసు వేసి కలపాలి. మాడిపోకుండా కలుపుతుండాలి. ఇది గట్టిపడి ముద్దలా అవ్వుతుంది. ఇప్పుడు నెయ్యి వేసి బాగా కలపాలి. మైదాపాలు, ద్రాక్ష రసం, పంచదార, నెయ్యి బాగా కలిసి ముద్దలాఅయి బాండి అంచులు విడుతుంది. అంతే హల్వా తయార్ అయ్యినట్టే. ఒక ప్లేటుకి నెయ్యి రాసి దానిలోకి తయారయిన హల్వాను వేసి సమంగా సర్ది, జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు పైన చల్లితే ద్రాక్ష హల్వా రెడి. చల్లారక ముక్కలుగా కట్ చెసి సర్వ్ చెయ్యాలి.

Tags :
|
|

Advertisement