Advertisement

రుచికరమైన రాగి మురుకులు

By: chandrasekar Fri, 10 July 2020 5:52 PM

రుచికరమైన రాగి మురుకులు


మనం తినే ఆహార పదార్థాలలో ఆరోగ్యమైనవి ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, పండ్లు ముఖ్యమైనవి. కానీ వాటితో పాటు ధాన్యాలు కూడా చాల ముఖ్యమైనవి. వీటిలో ప్రోటీన్స్, ఇనుము, పీచు పఢార్థాలు మొదలైన పోషకాలు ఉంటాయి. కనుక మనం రోజు కాక పోయిన అప్పుడప్పుడు ఆహారం లో ఉండేలా చూసుకోవాలి.

కావలసిన పదార్థాలు:

రాగిపిండి: 100 గ్రా
శనగపిండి: 10 గ్రా
వోమ: 5 గ్రా
జీలకర్ర: 5 గ్రా
కారంపొడి: 5గ్రా
నూనె: 200 గ్రా
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు: 60 మి.లీ

తయారీ విధానం:

శనగపిండి, రాగిపిండి రెండూ జల్లించి కలపాలి. ఉప్పు, కారం, వోమ, నువ్వులు పిండిలో కలిపి రెండు టేబుల్‌ స్పూన్ల వేడి నూనె పోసి వేడి నీళ్లతో ముద్దలా కలపాలి. బాండీలో నూనె కాగిన తరువాత చక్రాలు చేసే గిద్దలతో గుండ్రటి చక్రాలు ఒత్తాలి. రెండు వైపులా ఎర్రగా వేయించి తీసుకోవాలి.

Tags :
|
|

Advertisement