Advertisement

రుచికరమైన చల్లని మ్యాంగో ఐస్ క్రీమ్

By: chandrasekar Sat, 25 July 2020 4:47 PM

రుచికరమైన చల్లని మ్యాంగో ఐస్ క్రీమ్


ఐస్‌క్రీమ్‌లు బయట కొనుక్కుని తినే కన్నా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇక్కడ మేము మామిడి పండ్లతో ఐస్‌క్రీమ్ చేయడమెలాగో ఇక్కడ ఇచ్చాం అలాగే ఇతర పండ్లతో కూడా చేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు

మామిడి పండు గుజ్జు - ఒక కప్పు
మామిడి పండ్ల ముక్కల తరుగు - ఒక కప్పు
క్రీమ్ - మూడు కప్పులు
పంచదార - ఒక కప్పు
కస్టర్డ్ పౌడర్ - ఒక టేబుల్ స్పూను
వెనిల్లా - ఒక టీస్పూను
పాలు - ఒక కప్పు

delicious,cold,mango,ice,cream ,రుచికరమైన,  చల్లని, మ్యాంగో,  ఐస్ , క్రీమ్


తయారు చేసే విధానం

ఒక గిన్నెలో కొంచెం పాలు తీసుకుని దానిలో కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పాలను ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టాలి. అందులో పంచదార వేసి కలపాలి. పాలు వేడెక్కాక కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు కూడా వేసి రెండు నిమిషాలు మరిగించాలి. స్టవ్ కట్టేసి ఆ మిశ్రమాన్ని చల్లార్చాలి. అందులో మామిడి పండు గుజ్జు, మామిడి పండు ముక్కల తరుగు, క్రీమ్, వెనిల్లా వేసి బాగా గిలక్కొట్టాలి. తరువాత దానికి డీప్ ఫ్రిజ్ లో మూడు గంటల పాటూ ఉంచాలి. అనంతరం బయటికి తీస్తే యమ్మీ మ్యాంగో ఐస్ క్రీమ్ సిద్ధమైనట్టే.

Tags :
|
|
|

Advertisement