Advertisement

  • కొబ్బరితో రుచికరమైన కోకోనట్‌ ట్రఫిల్‌

కొబ్బరితో రుచికరమైన కోకోనట్‌ ట్రఫిల్‌

By: chandrasekar Mon, 22 June 2020 7:09 PM

కొబ్బరితో రుచికరమైన కోకోనట్‌ ట్రఫిల్‌


కొబ్బరి వల్ల ఆరోగ్యానికి అనేక లాభాలు వున్నాయి. మంచి పోషక విలువలున్న కొబ్బరి ని స్వీట్ రూపంలో తీసికోవడం వల్ల చర్మానికి మరియు జీర్ణవ్యవస్థకు చాలా మేలుకలుగుతుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడి దీనిని తింటారు. కొబ్బరి తురుముతో చాలా రుచికరమైన కోకోనట్‌ ట్రఫిల్‌ తాయారు చేయడం ఎలాగని చూస్తాం.

కావలసిన పదార్థాలు:

* కొబ్బరి తురుము – ముప్పావు కప్పు + 4 టేబుల్‌ స్పూన్లు
* కొబ్బరి పాలు – 2 కప్పులు
* తేనె – 4 టేబుల్‌ స్పూన్స్‌
* బటర్‌ – 1 టేబుల్‌ స్పూన్
* వెనీలా ఎస్సెన్స్ – అర టీ స్పూన్‌

తయారుచేయు విధానం:

ఒక పాత్రా తీసికొని స్టవ్‌ ఆన్‌ చేసుకుని దానిపై ఉంచి, బౌల్‌లో కొబ్బరి పాలు, తేనె వేసుకుని కొబ్బరిపాల మిశ్రమం దగ్గర పడేంత వరకూ మధ్యమధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు అందులో బటర్, కొబ్బరి తురుము, వెనీలా వేసుకుని ఓ ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్‌ దించుకుని కాస్త చల్లారగానే.. రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసి మిగిలిన కొబ్బరి తురుముని వాటికి బాగా పట్టించి సర్వ్‌ చేస్తే రుచికరమైన కోకోనట్‌ ట్రఫిల్‌ రెడీ.

Tags :

Advertisement