Advertisement

బాదంతో రుచికరమైన చాక్లెట్

By: chandrasekar Tue, 14 July 2020 6:27 PM

బాదంతో రుచికరమైన చాక్లెట్


చాక్లెట్స్ చాలా మంది బయట నుంచి కొనుక్కొచ్చి తింటుంటారు. అయితే, కాస్తా క్రియేటివిటీ ఉంటే వీటిని ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. దీనికి కాస్తా హెల్త్‌ని యాడ్ చేయాలంటే బాదంని చేర్చాల్సిందే. అదే ఆల్మండ్ చాక్లెట్. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

కావలసిన పఢార్థాలు:

1 కప్ డార్క్ చాకొలేట్
1/2 కప్ వేయించిన బాదం

డార్క్ చాకోలెట్స్ ని తీసుకోని 30 సెకన్ల వరకూ కరిగించి కొంచెం సేపు బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలాగే ఇంకో 30 సెకన్ల పాటు కరిగించుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల చాక్లెట్ చక్కగా కరిగిపోతుంది. ఒక గిన్నెను తీసుకోని అందులో కరిగించిన డార్క్ చాక్లెట్ ని వేసుకోవాలి అలాగే వేయించిన బాదాం పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పదార్దాలు బాగా కలిసేటట్లు గా చూసుకోండి. ఇప్పుడు చాక్లెట్ అచ్చు ట్రేని తీసుకోని అందులో చాక్లెట్ మిక్స్ ని వేసుకోవాలి. ఈ పేస్ట్ ని సమానంగా చేసి ఒక 10 నిమిషాలు ఫ్రీజర్ లో పెట్టి ఫ్రీజ్ చేసుకోవాలి. అంతే ఆల్మండ్ చాక్లెట్ కుకీస్ రెడీ.

Tags :

Advertisement