Advertisement

  • వంకాయ ప్రియులకు రుచికరమైన బ్రింజాల్‌ రోల్స్‌

వంకాయ ప్రియులకు రుచికరమైన బ్రింజాల్‌ రోల్స్‌

By: chandrasekar Wed, 01 July 2020 12:38 PM

వంకాయ ప్రియులకు రుచికరమైన బ్రింజాల్‌ రోల్స్‌


వంకాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆహార ప్రేమికులకు ఇష్టమైన కూరగాయలలో ఒకటి. కొన్ని అధ్యయనాల ప్రకారం వంకాయ మొక్కలో ఇతర మొక్కల కంటే ఎక్కువ నికోటిన్ ఉంటుందని నిరూపణ జరిగింది. ఆరోగ్యానికి వంకాయ మంచి చేస్తుందా అని ఒక సాధారణ ప్రశ్న కలుగుతుంది. మీరు వంకాయ యొక్క ప్రయోజనాలను ఒకసారి తెలుసుకొంటే,ఆరోగ్యం కోసం వంకాయ మంచిదని తెలుస్తుంది.

కావలసినవి పదార్థాలు: * వంకాయలు – 4 పెద్దవి
* ఉల్లికాడ ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్లు
* టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు చొప్పున
* కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు
* పుదీనా తరుగు – 1 టేబుల్‌ స్పూన్లు
* బీట్‌ రూట్‌ తురుము – పావు కప్పు
* బియ్యం రవ్వ – ముప్పావు కప్పు(ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి)
* ఆలివ్‌ నూనె – 2 టేబుల్‌ స్పూన్లు
* మిరియాల పొడి – అర టీ స్పూన్‌
* నిమ్మరసం – 4 టేబుల్‌ స్పూన్లు
* నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా
* జీలకర్ర పొడి – అర టీ స్పూన్‌
* వేరుశనగల పొడి – పావు కప్పు
* ఉప్పు – తగినంత

delicious,brinjal,rolls,for eggplant,lovers ,వంకాయ, ప్రియులకు ,రుచికరమైన, బ్రింజాల్‌, రోల్స్‌


తయారీ విధానం:


ఒక గిన్నె‌ తీసుకుని అందులో రెండున్నర గరిటెల నూనె వేసుకుని వేడి కాగానే ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, బీట్‌రూట్‌ తురుము, టమాటా ముక్కలు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, వేరుశనగల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ గరిటెతో తిప్పుతూ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించిన బియ్యం రవ్వను కూడా వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి.

ఆలివ్‌ నూనె, నిమ్మరసం వేసుకుని బాగా తిప్పుతూ ఉండాలి. చివరిగా ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. తర్వాత వంకాయలను పొడవుగా (థిన్‌ స్లైస్‌లా) కట్‌ చేసుకుని, నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుని, అందులో కొద్ది కొద్దిగా ఉల్లికాడల మిశ్రమాన్ని ఉంచుతూ రోల్స్‌లా చుట్టుకోవాలి. ఊడిపోకుండా సన్నని పుల్ల అడ్డంగా గుచ్చుకుని తీనేటప్పుడు ఆ పుల్లని తొలగించుకోవచ్చు. వీటిని కొత్తిమీర తరుగు, టమాటా ముక్కలతో లేదా ఇష్టమైన డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసుకుంటే బ్రింజాల్‌ రోల్స్‌ రెడీ.

Tags :
|

Advertisement