Advertisement

  • పర్యావరణ కాలుష్యానికి అమెరికా వంటి దేశాలే కారణం...

పర్యావరణ కాలుష్యానికి అమెరికా వంటి దేశాలే కారణం...

By: chandrasekar Fri, 11 Dec 2020 10:12 PM

పర్యావరణ కాలుష్యానికి అమెరికా వంటి దేశాలే కారణం...


అమెరికా వంటి పాశ్చాత్య దేశాలే ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం పెరగడానికి కారణమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జవడేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ కాలుష్యానికి భారత్ ఎంత మాత్రమూ కారణం కాదని పేర్కొన్నారు. భారత దేశం నుంచి కేవలం 3 శాతం మాత్రమే కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి.

పర్యావరణ కాలుష్యంలో అమెరికా వాటా అత్యధికంగా 25 శాతమని, ఇక 22 శాతంతో యూరప్ రెండో స్థానంలో ఉండగా 3వ స్థానంలో 13 శాతంతో చైనా ఉందని చెప్పారు. అలాంటప్పుడు పర్యావరణ కాలుష్యానికి భారత్ ఏ విధంగా కారణమవుతుందో తెలియజేయాలని ప్రశ్నించారు.

గత వంద ఏళ్లుగా భూమిపై కాలుష్యం గణనీయంగా పెరుగుతోందని జవడేకర్ పేర్కొన్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ ఆలోచన చేయాలని తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేసారు.

Tags :
|

Advertisement