Advertisement

  • చాకోచిప్ కుకీస్ పది నిమిషాల్లోనే తయారీ

చాకోచిప్ కుకీస్ పది నిమిషాల్లోనే తయారీ

By: Dimple Wed, 15 July 2020 6:46 PM

చాకోచిప్ కుకీస్ పది నిమిషాల్లోనే తయారీ


నచ్చిన వంటలుచేసుకునితినడంలో వచ్చే కిక్కే వేరు. ఇక ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఇంట్లో బోరింగ్‌ ఫీల్‌ అవుతున్నవారు రకరకాల రెసిపీ ల తో బిజీగా గడుపుతున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు లాక్‌డౌన్‌లో‌ గరిటె తిప్పడంపై శ్రద్ధ పెడుతున్నారు. వంటలు, స్నాక్స్‌, సలాడ్స్‌ ఇలా ఎన్నో రకాల రుచికరమైన వాటినిచేసుకుని ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే ఎప్పుడూఒకే విధమైన వంటకాలు చేయడం నచ్చలేనివాళ్లు కొత్తగా ఏదైనా తయారు చేయాలనుకుంటారు.అలాంటి వారు ఓ సారి చాకోచిప్‌ కుకీలను తయారు చేసి చూడండి. ఇది తెలిసిన వంటకమే అయినా తక్కువ పదార్థాలతో, చాలా తొందరగా చేయడం తెలిస్తే ఇక ఎప్పుడు దీనిని వదలరు. ఈ రకమైన బిస్కెట్లు తయారు చేయడానికి కేవలం పది నిమిషాలే సరిపోతుంది. అలాగే దీనికి ఓవెన్‌, ఎగ్స్‌ కూడా అవసరం లేదు. కావునశాఖాహార ప్రియులు కూడా లాగించేయవచ్చు. చిన్న వాళ్ల నుంచి ముసలి వాళ్ల వరకు అందరికి ఈ చాకోచిప్‌ కుకీలు నచ్చుతాయి. బయట భాగంలో క్రంచీగా, లోపల మృదువుగా ఉంటాయి. దీని తయారీకిమీకు కావలిసిందల్లా కేవలం మూడు పదార్థాలు. మరి అవేంటో తెలుసుకుందాం.

దీనికి కావాల్సిన పదార్థాలు

♦ 2 టేబుల్ స్పూన్లు - చాకో చిప్స్
♦ 100 గ్రా - వెన్న
♦ 1/2 కప్పు - పొడి చేసిన చక్కెర
♦ 1 కప్పు - మైదాపిండి

చాకోచిప్‌ కుకీలు ఎలాతయారు చేయాలో చుద్దాం..

ముందుగా ఒక గాజు గిన్నె తీసుకొని అందులో100 గ్రాముల వెన్న వేసి మెత్తటి మిశ్రమంలా అయ్యేవరకు గిలకొట్టండి. అందులోఅర కప్పు పొడిగా చేసినచక్కెర కలపండి. దీనిని మెత్తగా కలపాలి. తరువాత ఇందులోఒకటి పావు మైదా పిండిని జోడించండి. రుచికి సరిపడా ఉప్పు వేసి మరీ మెత్తగా, మరీ గట్టిగా కాకుండా మామూలుగా ఉండేపిండి ముద్దలాతయారు చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల చోకో-చిప్ కుకీలను వేసి పూర్తిగాకలపాలి. నాన్-స్టిక్ పాన్ తీసుకోని ఆయిల్‌ వేసి దానిపై వెన్న కాగితాన్ని ఉంచి మరోసారి నూనెతో తడపాలి. చేతులోకి కొద్దిగాపిండి ముద్దను తీసుకొని చిన్న బంతి లాగా చేసి అరచేతులతో దాన్ని కొంచెం వెడల్పు చేయాలి.పాన్‌లోసరిపోయేంతలాచిన్నగా చేసుకుని ప్రతి పిండి ముద్దకు మధ్యలో సరైన గ్యాప్‌ ఉంచాలి. ఇప్పుడుకుకీలకు కొద్దిగా చోకో-చిప్స్ జోడించండి.మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి.పాన్‌పైమూత పెట్టి తక్కువ మంటతో 10 నిమిషాల పాటు వేడి చేయండి. స్టవ్‌ కట్టేసి,గా పాన్‌పై మూత తీసి కుకీలు పూర్తిగా చల్లబడేదాకా ఆగండి. అంతే నోరూరించే టేస్టీ, క్రంచీ కుకీలు రెడీ. ఇంకేందుకు ఆలస్యం టెస్ట్‌ చేయండి.

Tags :
|

Advertisement