Advertisement

చికెన్‌ మసాలా కూర

By: chandrasekar Sat, 20 June 2020 5:27 PM

చికెన్‌ మసాలా కూర


నాన్ వెజ్ వంటకాలు ఆశగా తినేవారి కోసం స్పెషల్ వంటకం ఎలా తాయారు చేయాలో తెలుసుకుందాము. చికెన్‌ మసాలా కూర రెసిపి తయారు చేయడానికి ఏమి కావాలో చూద్దాం.

కావలసినవి:

* చికెన్‌: కిలో
* చిన్నఉల్లిపాయలు: పది
* లవంగాలు: నాలుగు
* కొబ్బరి/ఆవనూనె: అరకప్పు
* పసుపు:అరటీ స్పూన్‌
* టొమాటోలు: మూడు
* పచ్చిమిర్చి: నాలుగు
* దాల్చిన చెక్క: అంగుళం ముక్క, ఎండుమిర్చి: పది
* వెల్లుల్లి రెబ్బలు: నాలుగు
* మిరియాలు: అరటీ స్పూన్‌, జీరకర్ర: అరటీ స్పూన్‌
* ఉప్పు: తగినంత, కరివేపాకు: 2 రెబ్బలు
* కొత్తిమీర తురుము: టేబుల్‌ స్పూన్‌

chicken,masala,curry,food,non veg ,చికెన్‌, మసాలా, కూర, నాన్ వెజ్, వంటకం


తయారు చేసే విధానం:

పసుపు, దాల్చినచెక్క, లవంగాలు, ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు మెత్తగా రుబ్బాలి. బాణలిలో టేబుల్‌ స్పూన్‌ నూనే వేసి కాగాక పొట్టు తీసిన చిన్న ఉల్లిపాయలు వేసి వేయించాలి. తర్వాత టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి నూనే బయటకు వచ్చేవరకూ వేయించాలి.

మరో బాణలిలో మిగిలిన నూనే వేసి కాగాక రుబ్బిన పేస్టు వేసి అది కూడా వేగాక, చికెన్‌ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి సిమ్‌లో ఉడికించాలి. ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత వేయించిన ఉల్లిముక్కల మిశ్రమాన్ని వేసి కలపాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర తురుముతో అలంకరించి సర్వ్ చేయండి.

Tags :
|
|
|

Advertisement