Advertisement

  • రుచితో బాటు ఆరోగ్యాన్నిచ్చే బీట్‌రూట్‌ పాయసం

రుచితో బాటు ఆరోగ్యాన్నిచ్చే బీట్‌రూట్‌ పాయసం

By: chandrasekar Fri, 05 June 2020 11:06 AM

రుచితో బాటు ఆరోగ్యాన్నిచ్చే బీట్‌రూట్‌ పాయసం


ఆరోగ్యానికి మంచి పోషకవిలువలను అందించడంతో బాటు రుచి కరమైన స్వీట్ గా బీట్‌రూట్‌ పాయసం ఎలా తయారు చేయాలో చూడండి.

కావలసిన పదార్థాలు:
*బీట్‌రూట్‌ తురుము - 1 కప్పు తీసుకోండి
*క్యారెట్‌ తురుము - అరకప్పు తీసుకోండి
*బాంబినో మాకరోనీలు - ఒక కప్పు తీసుకోండి
*పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు తీసుకోండి
*గోరువెచ్చని పాలు - 2 కప్పులు
*వెనీలా ఐస్‌క్రీం - 2 కప్పులు
*పంచదార - ఒకటిన్నర కప్పు
*ఏలకుల పొడి - అర టీ స్పూను
*నేతిలో వేగించిన బాదం, జీడిపప్పు
*ఎండు ద్రాక్ష - 10 చొప్పున
*తేనె - 4 టీ స్పూన్లు
*నెయ్యి - 1 టేబుల్‌ స్పూను
*నీరు - మూడు కప్పులు

beetroot,poultry,nuts,badam,pissta ,బీట్‌రూట్‌, పాయసం, ఎండు ద్రాక్ష, తేనె, నెయ్యి


తయారుచేసే విధానం:

నెయ్యిలో బీట్‌రూట్‌, క్యారెట్‌ తురుముల్ని పచ్చివాసన పోయేదాక సన్నని మంటపై వేగించుకోవాలి. మరో పాత్రలో 2 కప్పుల నీరుపోసి మాకరోనీలు ఉడికించాలి. ఇవి మెత్తబడ్డాక వేగించిన బీట్‌రూట్‌, క్యారెట్‌ తురుము, పంచదార, కొబ్బరి తురుము, ఏలకుల పొడి, కప్పు నీరు పోసి పది నిమిషాలు ఉడికించి దించేయాలి. చల్లారిన తర్వాత పాలు, తేనె, వెనీలా ఐస్‌క్రీమ్‌ కలిపి బాదం, జీడిపప్పు, ద్రాక్షలతో అలంకరించుకోవాలి.

Tags :
|
|

Advertisement