Advertisement

ఉసిరి కాయ ఊరగాయ చేయు విధానం

By: chandrasekar Thu, 21 May 2020 6:44 PM

ఉసిరి కాయ ఊరగాయ చేయు విధానం

ఉసిరికాయలు విరివిగా దొరుకుతాయి. రోజు ఉసిరికాయ తీసుకుంటే, ఎన్జరీ అధికంగా ఉంటుంది. అలసట, ఒత్తిడి అనే మాటే ఉండదు. ఎండాకాలంలో ఉసిరికాయలు విరివిగా దొరుకుతాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరుకు చాలా ఉపయోగపడుతాయి. ఇలాంటి ఉసిరికాయతో ఊరగాయ ఎలా చేయాలో తెలుసుకుందాము.

కావలసిన పదార్థాలు:
* ఉసిరికాయలు - 1 కిలో
* ఉప్పు - అరకప్పు
* నిమ్మకాయలు - 4
* నువ్వుల నూనె - ముప్పావు కప్పు
* ఆవాలు - అరస్పూన్
* పసుపు - చిటికెడు
* కారం పొడి - అరకప్పు
* మెంతిపొడి - పావుకప్పు
* ఇంగువ - 1 స్పూన్


amla,pickle,health benefits,energy,antioxidents ,ఉసిరి కాయ,  ఊరగాయ, చేయు విధానం, ఎన్జరీ, యాంటీ ఆక్సిడెంట్స్


తయారు చేయు విధానం:
ఉసిరికాయలను నీళ్లతో కడిగి ఆరబెట్టాలి. బాణలిలో నువ్వుల నూనె వేసి ఆవాలు, ఇంగువ వేసి ఉసిరికాయలు వేసి మెత్తబడేవరకూ మూతపెట్టి సన్నని మంటపై ఉంచాలి. గిన్నెలోని ఉసిరికాయలు మెత్తబడిన తర్వాత నీళ్లు ఇంకిపోయేంత వరకు స్టవ్ మీద ఉడికించాలి. కాసేపటి తరువాత దించి ఇప్పుడు అందులో ఉప్పు, కారం, పసుపు, మెంతిపొడి వేసి నిమ్మరసం పిండి మెుత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మూడురోజుల పాలు జాడీలో ఊర నివ్వాలి. అంతే... ఉసిరికాయ పచ్చడి రెడీ.

Tags :
|
|
|

Advertisement