Advertisement

  • జెడ్‌టీఈ బ్లేడ్ 20 ప్రో 5జీ, జెడ్‌టీఈ యాక్సాన్ 20 4జీ స్మార్ట్ ఫోన్లు లాంచ్...

జెడ్‌టీఈ బ్లేడ్ 20 ప్రో 5జీ, జెడ్‌టీఈ యాక్సాన్ 20 4జీ స్మార్ట్ ఫోన్లు లాంచ్...

By: chandrasekar Fri, 20 Nov 2020 6:24 PM

జెడ్‌టీఈ బ్లేడ్ 20 ప్రో 5జీ, జెడ్‌టీఈ యాక్సాన్ 20 4జీ స్మార్ట్ ఫోన్లు లాంచ్...


చైనాలో జెడ్‌టీఈ బ్లేడ్ 20 ప్రో 5జీ, జెడ్‌టీఈ యాక్సాన్ 20 4జీ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయినట్లు సమాచారం. ఈ నెల ప్రారంభంలో లాంచ్ అయిన జెడ్‌టీఈ బ్లేడ్ 20 5జీకి తర్వాతి వెర్షన్‌గా జెడ్‌టీఈ బ్లేడ్ 20 ప్రో 5జీ లాంచ్ కాగా, గతంలో లాంచ్ అయిన జెడ్‌టీఈ యాక్సాన్ 20 5జీకి 4జీ వెర్షన్‌గా జెడ్‌టీఈ యాక్సాన్ 20 4జీ లాంచ్ అయింది. అండర్ డిస్ ప్లే కెమెరాతో ఈ ఫోన్ లాంచ్ కావడం విశేషం. వీటిలో జెడ్‌‌టీఈ 20 ప్రో 5జీలో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌ను అందించగా, జెడ్‌టీఈ యాక్సాన్ 20 4జీలో యూనిసోక్ టైగర్ టీ618 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ రెండు ఫోన్లూ మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతాయో ఇంకా సమాచారం లేదు.

జెడ్‌టీఈ బ్లేడ్ 20 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు....

గిజ్మోచైనా కథనం ప్రకారం...ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌ను అందించనున్నారు.

ఇందులో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉండనున్నాయి. వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి.

వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. ఇక ముందువైపు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించనున్నారు.

కర్వ్‌డ్ డిస్ ప్లే, సన్నని అంచులు ఉండనున్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది.

జెడ్‌టీఈ యాక్సాన్ 20 4జీ స్పెసిఫికేషన్లు..

జీఎస్ఎంఎరీనా కథనం ప్రకారం.. జెడ్‌టీఈ యాక్సాన్ 20 4జీ వేరియంట్లో ఆక్టా-కోర్ యూనిసోక్ టైగర్ టీ618 ప్రాసెసర్‌ను అందించనున్నారు.

జెడ్‌టీఈ యాక్సాన్ 20 5జీ వేరియంట్లో ఉన్న ఫీచర్లే దాదాపుగా ఇందులో కూడా ఉన్నాయి. ఇందులో కూడా వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి.

వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ టెర్టియరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ క్వార్టెనరీ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి.

ఇక ముందువైపు 32 మెగాపిక్సెల్ అండర్ డిస్ ప్లే కెమెరా అందించారు.

Tags :
|
|

Advertisement