Advertisement

  • బూతులతో పర్యాటకులను హడలెత్తిస్తున్న మాట్లాడే చిలుకలు

బూతులతో పర్యాటకులను హడలెత్తిస్తున్న మాట్లాడే చిలుకలు

By: Sankar Fri, 02 Oct 2020 05:36 AM

బూతులతో పర్యాటకులను హడలెత్తిస్తున్న మాట్లాడే చిలుకలు


చిలుకలు మాట్లాడుతుంటే చూడాలనిపిస్తుంది. మాటలు నేర్పిస్తే ముద్దుముద్దుగా మాట్లాడాయి. కొన్ని రకాల చిలకలు కొన్ని మాటలు మాత్రమే మాట్లాడగలవు. కానీ, కొన్ని మాత్రం ఎన్ని మాటలైనా మాట్లాడగలుగుతాయి.

మాటలు నేర్చిన ఐదు చిలుకలను ఇటీవలే బ్రిటన్ లోని లింకన్ షైర్ వైల్డ్ లైఫ్ పార్క్ కు తీసుకొచ్చారు. ఐదు చిలకలు బాగా ఆకట్టుకోవడంతో పర్యాటకులు వాటిని చూసేందుకు ఎక్కువగా వస్తున్నారు. అయితే మాటలు నేర్చిన ఈ చిలకలు వచ్చిన పర్యాటకులను బూతులు తిట్టడం మొదలుపెట్టాయి. అసభ్యకరమైన పదజాలంతో తిట్టిపోస్తుండటంతో పర్యాటకులు షాక్ అయ్యారు.

జూ సిబ్బందికి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ కావడంతో జూ సిబ్బంది ఆ ఐదు చిలకలను అక్కడి నుంచి దూరంగా ఎవరికీ కనిపించని ప్రదేశం ఉంచారట. ఎట్రాక్షన్ గా ఉంటాయని తీసుకొస్తే, పర్యాటకులను తిట్టిపోస్తున్నాయని జూ సిబ్బంది మండిపడుతున్నారు.

Tags :
|
|

Advertisement