Advertisement

గడ్డు పరిస్థితులలో జబర్ధస్త్ కామెడీ షో

By: chandrasekar Fri, 07 Aug 2020 4:05 PM

గడ్డు పరిస్థితులలో జబర్ధస్త్ కామెడీ షో


అదిరిపోయే జబర్ధస్త్ కామెడీ షో కు గడ్డు పరిస్థితులు ఎదురుపడ్డాయి. ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్ధస్త్ వంటి కామెడీ షోలకు ఇపుడు అనుకోని గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకప్పటిలా ఈ షోకు అదిరిపోయే టీఆర్పీలు మాత్రం రావడం లేదు. గత కొన్నేళ్లుగా లాక్‌డౌన్ కారణంగా ఈ షోలో పాత వాటినే రిపీట్ చేసారు. రీసెంట్‌గా లాక్‌డౌన్ ఎత్తివేసాకా షో మళ్లీ ప్రారంభమైంది.

జబర్ధస్త్ కామెడీ షోలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ చేసిన స్కిట్స్ ప్రేక్షకులను అలరించాయి. గత కొన్ని వారాలుగాజబర్ధస్త్ ప్రోగ్రామ్ కంటే ఎక్స్‌ట్రా జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కే ఎక్కువ టీఆర్పీలు వచ్చాయి. ఇక ఈ సంగతి పక్కన పెడితే.. ఈ షోతో ఎంత మంది కమెడియన్స్‌ వెలుగులోకి వచ్చారు. అంతేకాదు వీళ్లు సినిమాల్లో కూడా సత్తా చూపెడుతున్నారు.

జబర్దస్త్ షో నుండి నాగబాబు పక్కకు తప్పుకున్నారు. ఈ షోకు ఎలాంటి ఈ షో రేటింగ్స్‌లో ఏమన్నా ఛేంజెస్ వస్తాయా అని నిర్వాహకులు భయపడ్డారు. కానీ ఈ షో ఎప్పిటిలాగే తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దీంతో జబర్ధస్త్ జడ్జ్‌గా నాగబాబు లేకున్న ఆడియన్స్‌ ఈ జబర్ధస్త్ షో చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నరన్న సంగతి స్పష్టమైంది. దీంతో జబర్ధస్త్‌కు నాగబాబు లేకపోయినా దాని బ్రాండింగ్‌తో పాటు రేటింగ్‌ను నిలబెట్టుకుంది.

ఈ షోకు రోజాతో పాటు ప్రముఖ సింగర్ మనో మరో జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే అన్ని ప్రోగ్రామ్స్ కంటే ఈ షోకే రేటింగ్స్ ఎక్కువ. కానీ తాజాగా బార్క్ ప్రకటించిన రేటింగ్స్‌లో ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ షో కు గట్టి షాక్ ఇచ్చింది ఈటీవీ న్యూస్. దాంతో ఒకప్పడు టాప్ 5 ప్లేస్‌లో ఉండే జబర్దస్త్ ప్రోగ్రామ్ ఇపుడు అందులో స్థానం కోల్పోయింది. ప్రతి రోజు ఉదయం 7 గంటలకు, రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఈటీవీ న్యూస్ తాజాగా జబర్దస్త్ షో రేటింగ్స్‌ను క్రాస్ చేయడం నిర్వాహకులను కలవరపెడుతోంది.

కానీ ప్రజలు కరోనా నేపథ్యంలో ఎక్కడెక్కడ ప్రజలు దీని బారిన పడుతున్నారు. మరోవైపు కరోనాకు మందు ఎపుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తితో వార్తలను చూస్తున్నారనే విషయం స్పష్టమైంది. గత నెల రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. దీంతో నిర్వాహకులు ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోయినా ప్లాన్‌ బీతోనే సర్ధుకుపోతున్నారు. ఈ టీఆర్పీ రేటింగ్స్ ఇలాగే కొనసాగితే మాత్రం జబర్థస్త్‌కు కాస్త కష్టమనే చెప్పాలె. మరోవైపు జీ తెలుగులో అదిరింది ప్రోగ్రమ్ కూడా జబర్థస్త్‌కు గట్టి పోటీనే ఇస్తోంది. మరోవైపు జబర్ధస్త్ వంటి ప్రోగ్రామ్స్‌కు టీవీల్లో రేటింగ్ రాకపోయినా యూట్యూబ్‌లో మాత్రం మంచి వ్యూస్ దక్కించుకుంటున్నాయి. కరోనా ఎప్పుడు తగ్గుతుందో మళ్ళి ఎప్పుడు ప్రోగ్రాం పుంజు కుంటుందో అని ప్రజల వేచి చూస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement