Advertisement

  • జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు Z కేటగిరీ భద్రత

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు Z కేటగిరీ భద్రత

By: chandrasekar Mon, 05 Oct 2020 3:10 PM

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు Z కేటగిరీ భద్రత


బీజేపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ ప్రచారంలో భాగంగా ఆయనకు Z కేటగిరీ భద్రతను కేంద్రం కల్పించిందట. జనసేన పార్టీ అధినేత ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్ (Z) కేటగిరీ భద్రతను కల్పించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలతో పాటు పవన్ కళ్యాణ్ పర్యటించే ప్రాంతాల్లో Z కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలని అన్ని రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పవన్‌కు కల్పించిన Z కేటగిరీ భద్రత కింద 22 మంది వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు నలుగురు జాతీయ స్థాయి ఎన్ఎస్‌జీ కమాండోలు పవన్ కళ్యాణ్ భద్రతను పర్యవేక్షిస్తారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ పలు ప్రాంతాల్లో పర్యటనలు చేయనున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రతను ఇచ్చినట్లు తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ ప్రచార నిమిత్తం పలు ప్రాంతాల్లో ప్రయాణించనున్నాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్‌కు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ కేంద్రం Z కేటగిరీ భద్రత కల్పించింది. కాగా, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ సేవలను బీజేపీ ఉపయోగించుకునేందుకే భద్రత కల్పించినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక, పవన్ కళ్యాణ్ ఏకకాలంలో రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఆయన నటిస్తున్న ‘వకీల్ సాబ్’ షూటింగ్ తిరిగి మళ్ళీ పునః ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత క్రిష్ దర్శకంలో మరో సినిమా చేయనున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అతని అభిమానులు చాలా ఎదురు చూస్తున్నారు.

Tags :
|

Advertisement