Advertisement

  • టీటీడీలో యాబై కోట్ల పాత నోట్ల కరెన్సీ ఉంది ..మార్చాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేసిన టీటీడీ చైర్మన్

టీటీడీలో యాబై కోట్ల పాత నోట్ల కరెన్సీ ఉంది ..మార్చాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేసిన టీటీడీ చైర్మన్

By: Sankar Mon, 13 July 2020 7:34 PM

టీటీడీలో యాబై కోట్ల పాత నోట్ల కరెన్సీ ఉంది ..మార్చాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేసిన టీటీడీ చైర్మన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. టీటీడీ వద్ద ఉన్న రద్దయిన నోట్లను మార్పిడి చేయాలని కేంద్ర మంత్రిని సుబ్బారెడ్డి కోరారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన సుబ్బారెడ్డి.. 2016 నవంబర్ 8న నోట్ల రద్దుతో సుమారు రూ. 50 కోట్ల పాత పెద్ద నోట్లు టీటీడీ వద్ద ఉండిపోయాయని తెలిపారు.

నోట్ల రద్దు సమయంలో భక్తులు కానుకలుగా ఇచ్చిన ఆ డబ్బును మార్చాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. లాక్‌డౌన్ కారణంగా టీటీడీకి ఆదాయం పడిపోయిందని, కష్టాల్లో ఉన్న సంస్థను ఆదుకోవాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు, వెనుకబడిన జిల్లాలకు నిధులు తక్షణమే మంజూరు చేయాలని ఆర్థిక మంత్రిని కోరినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు.

కాగా, 2016 నవంబర్ 8వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ. 1,000, రూ. 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశ మొత్తం అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. నల్ల ధనాన్ని వెలికి తీయడం, ఉగ్రవాద కార్యకలాపాలకు మూకుతాడు వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు

Tags :
|
|

Advertisement